Kieron Pollard : బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ పట్టిన వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్.. వీడియో వైరల్

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kieron Pollard : బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ పట్టిన వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్.. వీడియో వైరల్

Kieron Pollard

Kieron Pollard Stunning Catches : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పదో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తొమ్మిదో సీజన్ లో లాహోర్ ఖలందర్స్ (Lahore Qalandars) తో జరిగిన మ్యాచ్ లో కరాచీ కింగ్స్ (Karachi Kings) జట్టు ప్లేయర్ పొలార్డ్ బౌండరీలైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. తబ్రైజ్ షమ్సీ వేసిన బంతికి ప్రమాదకరమైన బ్యాటర్ జహందాద్ ఖాన్ (12) సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. బాల్ గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్ అవతల పడే క్రమంలో పోలార్డ్ క్యాచ్ అందుకున్నాడు.

Also Read : WPL 2024 : శోభనా ఆశా అదరగొట్టేసింది.. ఉత్కంఠగా రెండో మ్యాచ్‌.. యూపీపై బెంగళూరు విజయం

లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియంలో కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కరాచీ కింగ్స్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 72 పరుగులు చేశాడు. లాహోర్ ఖలందర్స్ ఇన్నింగ్స్ లో 13వ ఓవర్లో కరాచీ కింగ్స్ బౌలర్ వేసిన బంతిని జహందాబాద్ ఖాన్ భారీ సిక్స్ గా మలిచే ప్రయత్నం చేశాడు. బంతి గాలిలోకి ఎగిరి బౌండరీ లైన్ ను ఆనుకొని సిక్స్ అవుతుందని అందరూ భావించారు. కానీ, పోలార్డ్ వేగంగా వచ్చి బౌండరీ లైన్ అవతల పడుతున్న బంతిని గాలిలోకి ఎగిరి అందుకున్నాడు. అతను తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి బంతిని గాలిలోకి విసిరి బౌండరీ లైన్ అవతల పడ్డాడు. వెంటనే లేచి మైదానంలోకి వచ్చి గాలిలో ఉన్న బంతిని పోలార్డ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ క్యాచ్ పోలార్డ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read : Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ మ‌రో రికార్డు.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 600+ప‌రుగులు.. దిగ్గ‌జాల స‌ర‌స‌న‌..