WPL 2024 : శోభనా ఆశా అదరగొట్టేసింది.. ఉత్కంఠగా రెండో మ్యాచ్‌.. యూపీపై బెంగళూరు విజయం

WPL 2024 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2024 సీజన్‌లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

WPL 2024 : శోభనా ఆశా అదరగొట్టేసింది.. ఉత్కంఠగా రెండో మ్యాచ్‌.. యూపీపై బెంగళూరు విజయం

WPL 2024 _ Asha Sobhana’s five-for helps Royal Challengers Bangalore beat UP Warriorz in nail-biter

WPL 2024 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2024 సీజన్‌లో రెండో మ్యాచ్‌‌లో మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్జ్‌తో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. యూపీ వారియర్జ్ కెప్టెన్ అలిస్సా హీలీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బెంగళూరులో మేఘన, రిచా ఘోష్ హాఫ్ సెంచరీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దాంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బెంగళూరు 157 పరుగులు చేసింది.

Read Also : PKL playoffs: హైదరాబాద్‌లో ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌ ప్లే ఆఫ్స్‌.. సర్వం సిద్ధం

యూపీని కట్టడి చేసిన బెంగళూరు :
బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని యూపీ వారియర్జ్ బ్యాటర్లు ఛేదించడంలో విఫలమయ్యారు. యూపీ బ్యాటర్లలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్, భారత యువ క్రీడాకారిణి శ్వేతా సెహ్రావత్ నాలుగో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కానీ, కీలకమైన 17వ ఓవర్‌లో శోభనా ఆశా బౌలింగ్‌లో ఐదు బంతుల్లోనే (5/22) మూడు వికెట్లు తీసి యూపీని కట్టడి చేసింది. బెంగళూరు బౌలర్మోలినెక్స్‌ ఎలీసా హీలే (5)కే పెవిలియన్ పంపింది.

ఆ తర్వాత ఆశా బౌలింగ్‌లో తహ్లియా మెక్‌గ్రాత్ (22), వ్రిందా దినేశ్‌ (18), గ్రేస్ హారిస్‌ (38), శ్వేతా షెహ్రవాత్‌ (31), కిరణ్‌ నవ్‌గిరె (1) ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టింది. పూనమ్ ఖెమ్నర్ (14), దీప్తి శర్మ (13) పరుగులకే సరిపెట్టుకున్నారు. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం పడగా బెంగళూరు బౌలర్లు కట్టడి చేయడంతో 8 పరుగులకే పరిమితమైంది. దాంతో యూపీ 155/7 స్కోరుకే చేతులేత్తేసింది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన శోభనాకు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

హాఫ్ సెంచరీలతో చెలరేగిన రిచా, మేఘన :
తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు స్మృతీ మంధాన (13), సోఫీ డివైన్ (1) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. సబ్బినేని మేఘన (53), రిచా ఘోష్‌ (62) హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. మిగిలిన మహిళా క్రికెటర్లలో ఎలీసా పెర్రీ (8), సోఫీ (9), శ్రేయాంక పాటిల్ (2) పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, సోఫీ ఎక్లెస్లోన్, దీప్తి శర్మ చెరో వికెట్‌ తీసుకున్నారు.

Read Also : ICF Sports Quota Recruitment : ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటా ఖాళీల భర్తీ