Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ మ‌రో రికార్డు.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 600+ప‌రుగులు.. దిగ్గ‌జాల స‌ర‌స‌న‌..

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో య‌శ‌స్వి జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు.

Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ మ‌రో రికార్డు.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 600+ప‌రుగులు.. దిగ్గ‌జాల స‌ర‌స‌న‌..

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal 600 plus runs : ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో య‌శ‌స్వి జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఓ సిరీస్‌లో 600ల‌కు పైగా ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. రాంచీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో 73 ప‌రుగులు చేయ‌డం ద్వారా జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు.

గత ఏడాది వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు జైస్వాల్‌. తాజా సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 103 స‌గ‌టుతో 78.32 స్ట్రైక్ రేటుతో 618 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు డ‌బుల్ సెంచ‌రీలు, 2 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

Sachin Tendulkar : చెప్పిన‌ట్లుగానే అమీర్‌ను క‌లిసిన స‌చిన్‌.. స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చాడు

సునీల్ గవాస్కర్ (1971, 1978), విరాట్ కోహ్లి (2014, 2016, 2017), దిలీప్ సర్దేశాయ్ (1971), రాహుల్ ద్రవిడ్ (2002) తర్వాత టెస్టు సిరీస్‌లో 600 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 5వ భారతఆట‌గాడిగా జైస్వాల్ రికార్డుల్లోకి ఎక్కాడు. 1971లో వెస్టిండీస్‌పై గవాస్కర్ 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 774 పరుగులు చేశాడు. 1978-79లో కూడా వెస్టిండీస్ పైనే 732 ప‌రుగులు చేశాడు. కాగా.. ఓ టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా త‌రుపున 700 పై చిలుకు ప‌రుగులు చేసింది ఒక్క గ‌వాస్క‌ర్ మాత్ర‌మే.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మ‌రో మూడు ఇన్నింగ్స్‌లు జైస్వాల్ అడే అవ‌కాశం ఉంది. ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అత‌డు రాణిస్తే గ‌వాస్క‌ర్ రికార్డు బ‌ద్ద‌లు కొట్ట‌డం పెద్ద క‌ష్టం కాదు.

దిగ్గ‌జాల స‌ర‌స‌న‌..

జైస్వాల్ కూడా డాన్ బ్రాడ్‌మన్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్, సునీల్ గవాస్కర్, గ్రేమ్ స్మిత్, జార్జ్ హెడ్లీ, నీల్ హార్వే లాగే 23 ఏళ్లు నిండకముందే టెస్ట్ సిరీస్‌లో 600కి పైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరిపోయాడు.

David Warner : డేవిడ్ వార్న‌ర్‌కు గాయం.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా?

డాన్ బ్రాడ్‌మాన్ – ఇంగ్లాండ్ పై 974 పరుగులు (1930లో)
గ్యారీ సోబర్స్ – పాకిస్థాన్‌పై 824 పరుగులు (1957-58లో)
సునీల్ గవాస్కర్ – వెస్టిండీస్‌పై 774 పరుగులు (1970-71లో)
గ్రేమ్ స్మిత్ – ఇంగ్లాండ్ పై 714 పరుగులు (2003లో)
జార్జ్ హెడ్లీ – ఇంగ్లాండ్‌పై 703 ప‌రుగులు (1929-30లో)
నీల్ హార్వే – దక్షిణాఫ్రికాపై 660 ప‌రుగులు (1949-50లో)
య‌శ‌స్వి జైస్వాల్ – ఇంగ్లాండ్ పై 618* ప‌రుగులు (2024లో)