KKR vs RCB : అయ్యో ఆర్సీబీ.. 2016 నుండి కొనసాగుతున్న కేకేఆర్ విజయాల పరంపర

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఫార్మాట్ లో కేకేఆర్, ఆర్సీబీ జట్లు 12 సార్లు (2024 ఐపీఎల్ టోర్నీలో మ్యాచ్ ను కలుపుకొని) తలపడ్డాయి.

KKR vs RCB : అయ్యో ఆర్సీబీ.. 2016 నుండి కొనసాగుతున్న కేకేఆర్ విజయాల పరంపర

KKR vs RCB Match

IPL 2024 KKR vs RCB Match : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. కోహ్లీ ఒంటరి పోరాటం వృథా అయింది. ఆర్సీబీ జట్టుకు హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ జట్టు వరుస విజయాలను నమోదు చేసుకుంటూ వస్తుండటం గమనార్హం. ఈ మైదాంనలో 2015 సంవత్సరంలో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా కేకేఆర్ జట్టుపై బెంగళూరు జట్టు విజయం సాధించింది. 2016 నుంచి ఆర్సీబీ హోంగ్రౌండ్ లో కేకేఆర్ తమ హవా కొనసాగిస్తోంది.

Also Read : కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. కోహ్లీ, గంభీర్ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఫార్మాట్ లో కేకేఆర్, ఆర్సీబీ జట్లు 12 సార్లు (2024 ఐపీఎల్ టోర్నీలో మ్యాచ్ ను కలుపుకొని) తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ జట్టు నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించగా.. కేకేఆర్ జట్టు ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది. అయితే, చివరిసారిగా ఈ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్ లలోనూ ఆర్సీబీ జట్టు ఓటమి పాలుకావటం విశేషం. తాజాగా 2024 సీజన్ లో శుక్రవారం కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనూ కేకేఆర్ జట్టు విజయం సాధించింది. దీంతో హోంగ్రౌండ్ లో ఆర్సీబీ జట్టు వరుసగా ఆరుసార్లు కేకేఆర్ జట్టుపై ఓడిపోయినట్లయింది.

Also Read : RCB vs KKR : కోల్‌కతా వరుసగా రెండో విజయం.. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 2016, 2017, 2018, 2019, 2023 ఐపీఎల్ సీజన్ లలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య పోరు జరగ్గా అన్నింటిల్లోనూ కేకేఆర్ జట్టు విజయం సాధించింది. తాజాగా జరిగే ఐపీఎల్ -2024 టోర్నీలో శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లోనూ కేకేఆర్ జట్టే విజయం సాధించడం గమనార్హం. ఇదిలాఉంటే తాజా మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించడంతో.. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ నుంచి వస్తున్న ఆనవాయితీకి చెక్ పడింది. ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్ నుంచి హోంగ్రౌండ్ జట్టే విజయం సాధిస్తూ వస్తోంది. గడిచిన తొమ్మిది మ్యాచ్ లలో హోంగ్రౌండ్ జట్టే విజయం సాధించగా.. శుక్రవారం  ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్  జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో ఆ ఆనవాయితీకి బ్రేక్ పడింది. ఐపీఎల్ 2024 టోర్నీలో 10వ మ్యాచ్ లో హోంగ్రౌండ్ జట్టు ఆర్సీబీపై కేకేఆర్ విజయం సాధించింది.