కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. కోహ్లీ, గంభీర్ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

ఆర్సీబీ, కేకేఆర్ జట్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గత ఐపీఎల్ మ్యాచ్ లో గంభీర్ వర్సెస్ కోహ్లీ అన్నట్లు మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. మైదానంలో ఎదురుపడినప్పుడు ఇద్దరూ ...

కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. కోహ్లీ, గంభీర్ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

Gautam Gambhir and Virat Kohli

Gautam Gambhir and ViratKohli : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ (59 బంతుల్లో 83 నాటౌట్) ఒక్కడే రాణించాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆర్సీబీ 182 పరుగులకే పరిమితం అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ జట్టు కేవలం 16.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 186 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్, మయాంక్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ రాణించడంతో కేకేఆర్ జట్టు విజయం తేలికైంది.

Also Read : RCB vs KKR : కోల్‌కతా వరుసగా రెండో విజయం.. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపు

ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గత ఐపీఎల్ సీజన్ లో గంభీర్ వర్సెస్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. మైదానంలో ఎదురుపడినప్పుడు ఇద్దరూ ఉప్పు, నిప్పులా ఉండేవారు. ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. అయితే, ఈ సీజన్ లో వారిద్దరూ కలిసిపోయారు. ఒకరినొకరు అలింగనం చేసుకొని పలుకరించుకున్నారు. కోల్ కతా ఫీల్డింగ్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. కోహ్లీ వద్దకు గంభీర్ వెళ్లాడు. గంభీర్ రావడాన్ని గమనించిన కోహ్లీ ఎదురుగా వెళ్లారు. ఇద్దరూ ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు. గంభీర్ ఏదో చెబుతుండగా కోహ్లీ నవ్వుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : కేకేఆర్, ఆర్సీబీ జట్లు చిన్నస్వామి స్టేడియంలో ఎన్నిసార్లు తలపడ్డాయో తెలుసా? ఆధిపత్యం ఎవరిదంటే?

కోహ్లీ, గంభీర్ మాట్లాడుకోవటం చూసి అభిమానులు షాక్ గురయ్యారు. గత సీజన్ లో కోట్లాటకుసైతం సిద్ధపడిన వీరు.. ఈ సీజన్ లో కలిసిపోవటం చూసి ఆనందం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున ఆడుతుండగా, గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టు మెంటార్ గా ఉన్నారు.