కేకేఆర్, ఆర్సీబీ జట్లు చిన్నస్వామి స్టేడియంలో ఎన్నిసార్లు తలపడ్డాయో తెలుసా? ఆధిపత్యం ఎవరిదంటే?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ లో కేకేఆర్, ఆర్సీబీ జట్లు 11 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ జట్టు నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించగా.. కేకేఆర్ జట్టు ఏడు సార్లు విజేతగా నిలిచింది.

కేకేఆర్, ఆర్సీబీ జట్లు చిన్నస్వామి స్టేడియంలో ఎన్నిసార్లు తలపడ్డాయో తెలుసా? ఆధిపత్యం ఎవరిదంటే?

KKR VS RCB

RCB vs KKR Match : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు రెండు మ్యాచ్ లు ఆడగా ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. కేకేఆర్ జట్టు ఆడిన ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ లో 32 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ జట్టు 18 సార్లు విజయం సాధించగా.. ఆర్సీబీ జట్టు 14 సార్లు విజేతగా నిలిచింది. చివరిసారిగా జరిగిన ఆరు మ్యాచ్ లలో ఆర్సీబీపై కేకేఆర్ జట్టు 4-2 రికార్డును కలిగి ఉంది.

Also Read : IPL 2024 : ఐపీఎల్‌లో ‘హోమ్‌గ్రౌండ్‌’ జట్లదే హవా.. తొమ్మిది మ్యాచ్‌ల‌లో విజేతలు వారే..!

బెంగళూరులో ఆదిపత్యం ఎవరిదంటే?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ లో కేకేఆర్, ఆర్సీబీ జట్లు 11 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ జట్టు నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించగా.. కేకేఆర్ జట్టు ఏడు సార్లు విజేతగా నిలిచింది. అయితే, చివరిసారిగా ఈ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్ లలోనూ ఆర్సీబీ జట్టు ఓటమి పాలుకావటం విశేషం. అయితే, ఇవాళ జరిగే మ్యాచ్ లో చినస్వామి స్టేడియంలో కేకేఆర్ జట్టు వరుస విజయాలకు ఆర్సీబీ జట్టు బ్రేక్ వేస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

Also Read : IPL 2024 : రెచ్చిపోయిన రియాగ్.. ఢిల్లీపై రాజస్థాన్ రాయల్స్ విజయం