IPL 2024 : రెచ్చిపోయిన రియాన్.. ఢిల్లీపై రాజస్థాన్ రాయల్స్ విజయం
ఢిల్లీపై రాజస్థాన్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో ఈ సీజన్‌లో రాజస్థాన్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

IPL 2024: Rajasthan March On To 2nd Win, Beat Delhi Capitals By 12 Runs
IPL 2024 : ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఢిల్లీపై రాజస్థాన్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో ఈ సీజన్‌లో రాజస్థాన్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఢిల్లీ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ 49, స్టబ్స్ 44 పరుగులతో అద్భుతంగా రాణించారు. కానీ, మిగతా ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరారు. ఇక రాజస్థాన బౌలర్లలో చాహల్, బర్గర్ చెరో రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.
ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 స్కోరు చేసింది. రాజస్థాన్ జట్టు ఆటగాళ్లలో రియాన్ పరాగ్ (84) విజృంభించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇక, అశ్విన్ (29), ధ్రువ్ జురెల్ (20) పరుగులతో పర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, అక్షర్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్ పడగొట్టారు.
This is him. ? pic.twitter.com/vI2foj1LOS
— Rajasthan Royals (@rajasthanroyals) March 28, 2024