IPL 2024 : ఐపీఎల్‌లో ‘హోమ్‌గ్రౌండ్‌’ జట్లదే హవా.. తొమ్మిది మ్యాచ్‌ల‌లో విజేతలు వారే..!

ఐపీఎల్ 2024 సీజన్ లో గురువారం రాత్రి వరకు తొమ్మిది మ్యాచ్ లు జరిగాయి.. ఈ తొమ్మిది మ్యాచ్ లలో హోంగ్రౌండ్ జట్టే విజేతగా నిలిచింది.

IPL 2024 : ఐపీఎల్‌లో ‘హోమ్‌గ్రౌండ్‌’ జట్లదే హవా.. తొమ్మిది మ్యాచ్‌ల‌లో విజేతలు వారే..!

IPL 2024

IPL 2024 Home Ground Teams Win : ఐపీఎల్ -2024 టోర్నీలో మ్యాచ్ లు మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. చివరి బాల్ వరకు నువ్వానేనా అన్నట్లుగా ఇరు జట్లు పోరాడుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో 28వ తేదీ వరకు తొమ్మిది మ్యాచ్ లు జరిగాయి. ఈ మ్యాచ్ లలో పలు రికార్డులు నమోదయ్యాయి. అయితే, ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో హోంగ్రౌండ్ జట్లే విజయం సాధించడం గమనార్హం.

Also Read : IPL 2024 : రెచ్చిపోయిన రియాగ్.. ఢిల్లీపై రాజస్థాన్ రాయల్స్ విజయం

  • తొమ్మిది మ్యాచ్‌ల‌లోనూ హోంగ్రౌండ్ జట్లే విజేతలు ..
  • ఐపీఎల్-2024 టోర్నీ ఈనెల 22న ప్రారంభమైంది.
  • తొలి మ్యాచ్ చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో హోంగ్రౌండ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
  • రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మొహాలీలో జరిగింది. ఈ మ్యాచ్ లోనూ హోంగ్రౌండ్ జట్టు పంజాబ్ కింగ్స్ విజేతగా నిలిచింది.
  • మూడో మ్యాచ్ కోల్‌కతా వేదికగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో హోంగ్రౌండ్ జట్టు కేకేఆర్ విజయం సాధించింది.
  • నాల్గో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జైపూర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో హోంగ్రౌండ్ జట్టు రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది.
  • ఐదో మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లోనూ హోంగ్రౌండ్ జట్టు గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది.
  • ఆరో మ్యాచ్ బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లోనూ హోంగ్రౌండ్ జట్టు బెంగళూరు విజేతగా నిలిచింది.
  • ఏడో మ్యాచ్ చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లోనూ హోంగ్రౌండ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది.
  • ఎనిమిదో మ్యాచ్ హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లోనూ హోంగ్రౌండ్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది.
  • తొమ్మిదో మ్యాచ్ జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లోనూ హోంగ్రౌండ్ జట్టు రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది.

Also Read : IPL 2024: ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకు? హార్దిక్ పాండ్యాపై విమర్శల వెల్లువ

ఐపీఎల్ 2024లో 10వ మ్యాచ్ శుక్రవారం రాత్రి బెంగళూరు వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. తొమ్మిది మ్యాచ్ ల ఆనవాయితీని కొనసాగిస్తూ బెంగళూరు జట్టు విజేతగా నిలుస్తుందా? హోంగ్రౌండ్ జట్లే విజేతగా వస్తున్న ఆనవాయితీకి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచి బ్రేక్ వేస్తుందా.. అనే అంశం ఆసక్తికరంగా మారింది.