ఐపీఎల్ 2019లో భాగంగా సొంతగడ్డపై జరిగిన సమరంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢిల్లీ జట్టు చిత్తుగా బాదింది. నిర్ణీత ఓవర్లలో టార్గెట్ చేధించేందుకు ఢిల్లీ క్రికెటర్లు కోల్‌కతాపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పృథ్వీ షా(99; 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులు)స్కోరుతో జట్టుకు బలాన్ని చేకూర్చాడు. స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్(16)విఫలమైన వేళ జట్టుకు ఊతమిచ్చాడు.
ఆఖరి బంతి వరకూ సాగిన ఉత్కంఠభరితపోరును ఎట్టకేలకు టైగా ముగించారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(43)బాదినప్పటికీ జట్టు తీరు మార్చలేకపోయారు. రిషబ్ పంత్(11), కొలిన్ ఇంగ్రామ్(10), హనుమవిహారీ(2), హర్షల్ పటేల్(0)లు రాణించారు.
ఐపీఎల్ 10వ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా వికెట్లు నష్టపోయి పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో దినేశ్ కార్తీక్(50; 36 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సులు), ఆండ్రీ రస్సెల్(62; 28బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్సులు)తో జట్టుకు హైలెట్ స్కోరు చేయగలిగారు.
మిగిలిన ప్లేయర్లు నిఖిల్ నాయక్(7), క్రిస్ లిన్(20), రాబిన్ ఊతప్ప(11), నితీశ్ రానా(1), శుభమాన్ గిల్(4), పీయూశ్ చావ్లా(11), కుల్దీప్ యాదవ్(10)పరుగులు చేయగలిగారు.