KL Rahul : కేఎల్ రాహుల్ నువ్వు మామూలోడివి కాద‌య్యా.. ఐపీఎల్‌లో ‘సిక్స‌ర్ల కింగ్’ వి..

ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ (KL Rahul ) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

KL Rahul becomes first ever player to achieve major six hitting record in IPL (pic credit@ipl)

  • ఢిల్లీ త‌రుపున ఈ సీజ‌న్‌లో 31 సిక్స‌ర్లు బాదిన కేఎల్ రాహుల్
  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త
  • మూడు వేరు వేరు ఫ్రాంఛైజీల త‌రుపున ఓ సీజ‌న్‌లో 30+ సిక్స‌ర్లు కొట్టిన ఏకైక ఆట‌గాడు

KL Rahul : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ కు చేర‌కుండానే ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిష్ర్క‌మించింది. అయిన‌ప్ప‌టికి కూడా ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌రుపున ఈ సీజ‌న్‌లో రాహుల్ 14 ఇన్నింగ్స్‌ల్లో 593 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో టోర్న‌మెంట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో ప్ర‌స్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తా పై నాలుగు సిక్స‌ర్లు బాద‌డంతో ఈ సీజ‌న్‌లో ఢిల్లీ త‌రుపున రాహుల్ 31 సిక్స‌ర్లు న‌మోదు చేశాడు.

ఈ నేప‌థ్యంలో ఓ అరుదైన రికార్డును రాహుల్ నెల‌కొల్పాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో మూడు వేరు వేరు ఫ్రాంఛైజీల త‌రుపున‌ ఓ సీజ‌న్‌లో 30 సిక్స‌ర్లు బాదిన తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. గ‌తంలో రాహుల్ పంజాబ్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తూ ఓ సీజ‌న్‌లో 30కి పైగా సిక్స‌ర్లు కొట్టాడు.

Riyan Parag : మ‌మ్మ‌ల్ని ఇంటికి పోకుండా కాపాడింది అత‌డే.. రియాన్ ప‌రాగ్ హాట్ కామెంట్స్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. లీగ్ ద‌శ‌లో ఢిల్లీ త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ (60; 30 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (39), డేవిడ్ మిల్ల‌ర్ (28)లు రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సౌరభ్ దుబే రెండు వికెట్లు తీశాడు. అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లు త‌లా ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం 204 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో కేకేఆర్ 18.4 ఓవ‌ర్ల‌లో 163 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో అజింక్యా రహానే (63; 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం బాదాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి, కుల్దీప్ యాద‌వ్‌లు చెరో మూడు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అక్ష‌ర్ ప‌టేల్ ఓ వికెట్ సాధించాడు.