×
Ad

Kl Rahul : శ‌త‌కంతో చెల‌రేగిన కేఎల్ రాహుల్‌.. సెమీస్‌లో అడుగుపెట్టిన క‌ర్ణాట‌క‌.. ముంబై పై ఘ‌న విజ‌యం

టీమ్ఇండియా ఆట‌గాడు కేఎల్ రాహుల్ (Kl Rahul) సెంచ‌రీతో చెల‌రేగాడు

KL Rahul Hundred Takes Karnataka Into Ranji Semis

Kl Rahul : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్, మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. రంజీ ట్రోఫీ క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ముంబై పై సెంచ‌రీ చేసి త‌న జ‌ట్టు క‌ర్ణాట‌క‌ను గెలిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 182 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 130 ప‌రుగులు సాధించాడు. కేఎల్ రాహుల్‌కు ఇది 24వ ఫ‌స్ట్ క్లాస్ సెంచ‌రీ.

325 పరుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో రాహుల్ తో పాటు స్మ‌ర‌ణ్ ర‌విచంద్ర‌న్ (83 నాటౌట్; 123 బంతుల్లో 11 ఫోర్లు) రాణించ‌డంతో క‌ర్ణాట‌క జ‌ట్టు ఆరు వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది. త‌ద్వారా సెమీఫైన‌ల్ కు చేరుకుంది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో క‌ర్ణాట‌క జ‌ట్టు ఉత్తరాఖండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

T20 World Cup 2026 : ఎట్ట‌కేల‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో గెలుపు బోణీ కొట్టిన స్కాట్లాండ్‌.. ఇటలీ పై భారీ విజ‌యం..

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 120 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఆ త‌రువాత మ‌యాంక్ అగ‌ర్వాల్ (92 )రాణించ‌డంతో క‌ర్ణాట‌క జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 173 ప‌రుగులు చేసింది. దీంతో క‌ర్ణాట‌కు 53 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

T20 World Cup 2026 : భార‌త్‌తో ఓట‌మి.. అమెరికా జ‌ట్టుకు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మెసేజ్‌.. నాకు తెలియ‌దు.. కానీ..

అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై బ్యాట‌ర్లు చెల‌రేగి ఆడారు. ఆకాశ్ ఆనంద్ (70), ముషీర్ ఖాన్ (49) రాణించ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 377 ప‌రుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తీసివేయ‌గా క‌ర్ణాట‌క ముందు 325 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.