Virat Kohli : కోహ్లీ భార్యకు ఏమైంది? అనుష్కశర్మ ప్రెగ్నెన్సీలో సమస్యలు? ఏదీ నిజం?
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరం కావడంతో అభిమానులు నిరాశ చెందారు.
- Thota Vamshi Kumar
- Published On : February 13, 2024 / 02:55 PM IST
Kohli and Anushka consulting doctors over the actor's health issues report
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరం కావడంతో అభిమానులు నిరాశ చెందారు. వ్యక్తిగత కారణాలతో అతడు మొదటి రెండు టెస్టులు ఆడలేదు. మూడో టెస్టుకు అయినా అందుబాటులోకి వస్తాడు అనుకుంటే అది జరగలేదు. కోహ్లీ విజ్ఞప్తి మేరకు అతడి సెలవును పొడిగించినట్లు ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది. అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపింది.
దీంతో కోహ్లీ ఎందుకు క్రికెట్ ఆడడం లేదనే ప్రశ్నలు వచ్చాయి. అతడి తల్లికి బాలేదనే ప్రచారం జరుగగా కోహ్లీ తమ్ముడు స్వయంగా అమ్మ బాగానే ఉంది. ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయొద్దు అని కోరడంతో అది ఓ రూమర్ అని తేలిపోయింది.
IND vs ENG 3rd Test : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు.. భారత్‌కు మరో షాక్..!
అనుష్క శర్మ రెండో సారి తల్లికాబోతుందని విషయాన్ని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మొదటగా చెప్పాడు. అయితే.. ఆ తరువాత మాట మార్చాడు. తప్పుడు సమాచారం వల్లే ఇది జరిగిందని, ఇందుకు కోహ్లీ దంపతులను క్షమాపణలు సైతం కోరాడు. ఈ క్రమంలో అసలు కోహ్లీ కుటుంబంలో ఏదో జరుగుతుందని అభిమానులు కలవరపాటుకు గురి అవుతున్నారు.
ప్రెగ్నెన్సీలో సమస్యలు..?
ఈ క్రమంలో మరో వార్త తెరపైకి వచ్చింది. అనుష్క ప్రెగెన్సీ నిజమేనని, అయితే.. ప్రెగ్నెన్సీలో సమస్యలు ఉన్నాయని అంటున్నారు. అందుకే వాళ్లు విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు వెళ్లారని సదరు వార్తల సారాంశం. ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్న విషయం తెలియాల్సి ఉంది. అయినప్పటికీ ఈ వార్తలు కోహ్లీ అభిమానుల ఆందోళనను రెట్టింపు చేసేలా ఉంది.
శుభవార్త..!
విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బరిలోకి దిగుతాడని ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. ఐదో టెస్టు నాటికి అతడు అందుబాటులోకి వస్తాడన్నారు. ఐదో టెస్టు మ్యాచులో విరాట్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.
Ranji Trophy 2024 : ఇలాంటి మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేయరా..? బీసీసీఐ పై అభిమానుల మండిపాటు
ఇదిలా ఉంటే.. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ లో ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ 1-1తో సమంగా నిలిచాయి. ఫిబ్రవరి 15 (గురువారం) నుంచి మూడో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.
