Virat Kohli : బౌలింగ్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ అరుపులు.. వద్దురా బాబు అంటూ కోహ్లి రియాక్షన్.. వీడియో వైరల్
ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 12, 2024 / 09:12 PM IST
Kohli reaction to fans chanting Kohli ko bowling do in MI vs RCB match
Kohli ko bowling do : ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తుండగా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేస్తుండడంతో ఆర్సీబీకి ఓటములు తప్పడం లేదు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆరు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది. ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. రెండు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అయితే.. ఈ లక్ష్యాన్ని ముంబై 15.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు.
Mary Kom : ఒలింపిక్స్ బాధ్యతల నుంచి తప్పుకున్న మేరీకోమ్.. మరో అవకాశం లేదు..
ముంబై విజయం దాదాపుగా ఖరారు అయిన సమయంలో ఆర్సీబీ బౌలర్లపై ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో మైదానంలోని ప్రేక్షకులు కోహ్లి కో బౌలింగ్ దో (కోహ్లికి బౌలింగ్ ఇవ్వండి) అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీన్ని విన్న కోహ్లి వద్దురా బాబు అనే విధంగా రియాక్షన్ ఇచ్చాడు. సారీ చెబుతున్నట్లుగా చెవులపై చేతులు పెట్టుకుని కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ వరుసగా మ్యాచులు ఓడిపోతున్నప్పటికీ విరాట్ కోహ్లి మాత్రం దుమ్ములేపుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 319 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ అతడి వద్దే ఉంది.
