Krunal Pandya : అప్పుడు బాగానే ఆడాను.. మ‌ళ్లీ ఆడాల‌ని అనుకుంటున్నాను.. కృనాల్ పాండ్యా హాట్ కామెంట్స్‌

టీమ్ఇండియా త‌రుపున ఆడ‌డ‌మే త‌న అంతిమ ల‌క్ష్యం అని, త్వ‌ర‌లోనే రీ ఎంట్రీ ఇస్తాన‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya) తెలిపాడు.

Krunal Pandya emphasised that playing for India is his ultimate goal (pic credit@IPL)

Krunal Pandya : టీమ్ఇండియా త‌రుపున ఆడ‌డ‌మే త‌న అంతిమ ల‌క్ష్యం అని, త్వ‌ర‌లోనే రీ ఎంట్రీ ఇస్తాన‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా తెలిపాడు. భార‌త జ‌ట్టులో చోటు కోసం తాను ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌డం లేద‌న్నాడు. ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా ఆట‌పైనే ఉంద‌న్నాడు.

ఆల్‌రౌండ‌ర్‌గా రాణించ‌డంతో పాటు జ‌ట్టు విజ‌యాల్లో తోడ్ప‌డ‌టంపైనే తాను దృష్టి సారించాన‌ని తెలిపాడు. తాను మెరుగ్గా రాణిస్తూ ఉంటే.. అవ‌కాశాలు వాటంత‌ట అవే వ‌స్తాయ‌న్నాడు. గ‌తంలో దేశం త‌రుపున ఆడే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు తాను బాగానే ఆడినట్లు తెలిపాడు.

IPL 2026 : ఒకే మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ.. ఒక‌వేళ వారు జ‌ట్టుకు దూర‌మైతే వారి స్థానాల‌ను భ‌ర్తీ చేసేది ఎవ‌రంటే?

దేశానికి ప్రాతినిధ్యం వహించడమే అంతిమ లక్ష్యం, నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను. నా చేతిలో ఉన్న పనిని కొనసాగించాలనుకుంటున్నాను. అదేంటంటే మైదానంలోకి వెళ్లి రాణించి మ్యాచ్‌లు గెలవడం. ఆ క్రమంలో నాకు ఆ అవకాశం వస్తే చాలా సంతోషిస్తాను. ఎందుకంటే దేశం కోసం ఆడటమే అంతిమ లక్ష్యం. అని కృనాల్ పాండ్యా అన్నాడు.

అవును దేశం తరపున వైట్ బాల్ ఆడుతూ నాకు వచ్చిన అవకాశాలన్నింటిలోనూ నేను ఆ సమయంలో చాలా బాగా రాణించాను. నేను నా పని నేను చేసుకోవాలనుకుంటున్నాను, మిగతా విషయాలను దేవుడికి వదిలేస్తాను. అని కృనాల్ చెప్పుకొచ్చాడు.

2018లో టీమ్ఇండియా త‌రుపున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు కృనాల్ పాండ్యా. అత‌డు చివ‌రిగా సారిగా 2021 జూలైలో శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో చివ‌రి సారిగా భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. మొత్తంగా అత‌డు 5 వ‌న్డేలు, 19 టీ20 మ్యాచ్‌ల్లో భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ 24 మ్యాచ్‌ల్లో 254 ప‌రుగులు చేయ‌డంతో పాటు 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

IPL 2026 : సోద‌రుడు హార్దిక్ ఔట్ కాగానే కాస్త అతిగా సంబ‌రాలు చేసుకున్న కృనాల్ పాండ్యా.. వీడియో వైర‌ల్‌..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఎలాగున్న‌ప్ప‌టికి కూడా ఐపీఎల్‌లో అద‌ర‌గొడుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 146 మ్యాచ్‌లు ఆడాడు. 22 స‌గ‌టుతో 1332 ప‌రుగులు సాధించాడు. బౌలింగ్‌లో 98 వికెట్లు సాధించాడు.