Kuldeep Yadav wedding : వంశికతో కుల్దీప్ యాదవ్ పెళ్లి.. ఎప్పుడంటే?
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav wedding) త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు
- Thota Vamshi Kumar
- Published On : March 10, 2026 / 12:48 PM IST
Kuldeep Yadav will marry Vanshika on March 14
- మార్చి 14న కుల్దీప్ యాదవ్ పెళ్లి
- చిన్ననాటి స్నేహితురాలు వంశికతో వివాహం
- మార్చి 17న రిసెప్షన్
Kuldeep Yadav wedding : టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. అతడు తన ప్రియురాలు వంశికను మార్చి 14న పెళ్లి చేసుకోనున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలోని ఒక రిసార్ట్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.
మార్చి 13న ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. హల్ది, మెహందీ వేడుకలు ఉత్తరాఖండ్‌లోని సుందరమైన కొండల మధ్య అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరగనున్నట్లు సమాచారం.
మార్చి 17న లక్నోలోని సెంట్రమ్ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు బీసీసీఐ అధికారులు, ప్రస్తుత, మాజీ భారత ఆటగాళ్లలతో పాటు సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు సెలబ్రెటీలు హాజరు అయ్యే అవకాశం ఉంది.
కాగా.. టీ20 ప్రపంచకప్ 2026లో ఆడేందుకు గాను కుల్దీప్ యాదవ్ తన పెళ్లిని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
ఎవరీ వంశిక..
వంశిక స్వస్థలం లక్నోలోని శ్యామ్ నగర్. ప్రస్తుతం ఆమె లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో పనిచేస్తుందని తెలుస్తోంది. వంశిక, కుల్‌దీప్ యాదవ్ లు పాఠశాల నుంచే స్నేహితులు. వీరి స్నేహం ఈక్రమంగా ప్రేమగా మారింది. వీరిద్దరు ఇరు కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు. 2025 జూన్ 4న వీరి నిశ్చితార్థం జరిగింది.
