India Vs Pakistan Representative Image (Image Credit To Original Source)
India Vs Pakistan: టీ20 వరల్డ్ కప్ లో దాయాదుల మ్యాచ్ కు లైన్ క్లియర్ అయ్యింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. 8 రోజుల పాకిస్తాన్ డ్రామాకు ఎండ్ కార్డ్ పడనుంది. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ జరగనుంది. ఈ నెల 15న కొలంబోలో భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శ్రీలంక వేదికగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించిన నేపథ్యంలో పీసీబీ చైర్మన్ నఖ్వీతో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా సమావేశం అయ్యారు.
ఈ నెల 15న జరగాల్సిన మ్యాచ్ పై సస్పెన్స్ నెలకొనడంతో సందిగ్దతకు తెరదించేందుకు ఐసీసీ రంగంలోకి దిగింది. పాకిస్తాన్ లోని లాహోర్ లో పాక్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నఖ్వీతో సమావేశమైంది. మ్యాచ్ ఆడకపోతే ఎదుర్కోవాల్సిన పరిణామాలను పాక్ కు వివరించింది ఐసీసీ. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి తమకు మరింత సమయం కావాలని నఖ్వీ కోరినట్లుగా తెలుస్తోంది.
అయితే, భారత్ తో మ్యాచ్ పై పాకిస్తాన్ కు ఐసీసీ 24 గంటల డెడ్ లైన్ విధించింది. బంగ్లాదేశ్ ను వరల్డ్ కప్ నుంచి ఐసీసీ తప్పించడంతో.. బంగ్లాకు మద్దతుగా భారత్ తో మ్యాచ్ ను బాయ్ కాట్ చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో పాక్ ను దారికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఐసీసీ, పీసీబీ మధ్య సమావేశం జరిగింది. ఈ క్రమంలో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అమీనుల్ ఇస్లామ్ కూడా ఐసీసీ మీటింగ్ లో పాల్గొన్నారు.
మరోవైపు ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అమినుల్ ఇస్లాం కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. తమకు మద్దతుగా పాకిస్తాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటామన్నారు. పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యానని, వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపానని అమినుల్ ఇస్లాం వెల్లడించారు. కాగా, క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన వివరించారు.
Also Read: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఐసీసీ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెట్టిన డిమాండ్లు ఇవే..!