IPL 2026 : ఐపీఎల్ 2026లో ఈ ముగ్గురు విధ్వంసకర వికెట్ కీపర్ల పై ఓ కన్నేయాల్సిందే..!
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 2026 (IPL 2026 ) సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Published On : March 20, 2026 / 07:21 PM IST
Eye these three wicket keeping batsmen in IPL 2026
IPL 2026 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ సీజన్‌లో ఓ ముగ్గురు వికెట్ కీపర్, బ్యాటర్లపై అభిమానుల దృష్టి ఉంది. ఈ ముగ్గురు తమ వికెట్ కీపింగ్‌తో మాత్రమే కాకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ గమనాన్నే మార్చగల సమర్థులు.
ఇషాన్ కిషన్..
ఐపీఎల్ 2026 సీజన్‌లో అందరి దృష్టి ఇషాన్ కిషన్ పైనే ఉంది. ప్రస్తుతం అతడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. 9 మ్యాచ్‌ల్లో 35.22 సగటుతో 317 పరుగులు సాధించాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది.
ODI World Cup 2027 : వన్డే ప్రపంచకప్ 2027 కోసం.. 20 మంది పేర్లతో లిస్ట్ రెడీ చేసిన బీసీసీఐ!
ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 29.11 సగటుతో 2998 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కీపింగ్‌లో 59 క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఐదు స్టంపౌట్లు చేశాడు.
క్వింటన్ డికాక్..
టీ20క్రికెట్‌లో విధ్వంసకర ఆటగాళ్లలో క్వింటన్ డికాక్ ఒకడు. ఐపీఎల్ 2026లో అతడు ముంబై ఇండియన్స్ తరుపున ఆడనున్నాడు. వేలంలో అతడిని ముంబై కేవలం కోటీ రూపాయలకే కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతడు రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
డికాక్ ఇప్పటి వరకు 115 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 30.64 సగటుతో 3309 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కీపింగ్‌లో 73 క్యాచ్‌లు అందుకున్నాడు. 16 స్టంపింగ్‌లు చేశాడు.
జోస్ బట్లర్..
టీ20ల్లో విధ్వంసకర వీరుల్లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఒకరు. అతడు ఓపెనింగ్‌తో పాటు మిడిల్ ఆర్డర్‌లోనూ బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్ 2026లో అతడు గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వేలంలో గుజరాత్ అతడిని 15.75 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇప్పటి వరకు అతడు ఐపీఎల్‌లో 121 మ్యాచ్‌లు ఆడాడు. 4120 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 24 అర్థశతకాలు ఉన్నాయి. కీపింగ్‌లో 63 క్యాచ్‌లు పట్టడంతో పాటు 3 స్టంపౌట్లు చేశాడు.
