IPL 2023: లక్నో జట్టుకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం.. తరువాత మ్యాచ్ ఆడేది అనుమానమే..
పంజాబ్‌తో మ్యాచ్ సమయంలో బౌలింగ్ చేస్తున్న లక్నో జట్టు ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ వేలికి గాయమైంది.
- Harishth Thanniru
- Published On : April 29, 2023 / 12:55 PM IST
Marcus stoinis
IPL 2023: లక్నో సూపర్ జాయింట్స్ జట్టు అభిమానులకు షాకింగ్ న్యూస్. ఆ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌కు గాయమైంది. వేలుకు గాయం కావటంతో అతను తదుపరి మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడిన లక్నో ఘన విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు స్టోయినిస్ 40 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 257 పరుగులు సాధించింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు 19.5 ఓవర్లకు 201 పరుగులు చేసింది.
IPL 2023, PBKS vs LSG: పంజాబ్ చిత్తు.. లక్నో ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం
పంజాబ్‌తో మ్యాచ్ సమయంలో బౌలింగ్ చేసిన స్టోయినిస్.. ఫాలో త్రూలో అథర్వ ట్రేట్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో వేలికి గాయమైంది. ఫిజియో వచ్చినప్పటికీ స్టోయినిస్ నొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఆ ఓవర్లో చివరి బంతిని ఆయుష్ బందోనీ వేశాడు. ఆ తరువాత స్టోయినిస్ మైదానంలోకి తిరిగి రాలేదు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకొనే క్రమంలో మాత్రమే మైదానంలోకి స్టోయినిస్ వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలు ప్రస్తుతానికి మెరుగ్గా ఉందని, కానీ స్కానింగ్ చేస్తే కానీ గాయం తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం అవుతుందని చెప్పాడు.
IPL 2023: కోల్‌కతాకు భారీ షాక్.. వచ్చాడు.. ఒక్క మ్యాచ్ ఆడాడు.. వెళ్లిపోయాడు
పంజాబ్ కింగ్స్ జట్టు పై విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2023 సీజన్ లో మొత్తం ఎనిమిది మ్యాచ్ లు ఆడిన లక్నో జట్టు.. ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి, మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టులో స్టోయినిస్ మంచి ఫాంలో ఉన్నాడు. అతడు జట్టు నుంచి దూరమైతే ఆ జట్టుకు ఇది ఇబ్బందికరమైన విషయమే.
