IPL 2027 : ముంబై ఇండియన్స్‌కు మహేళ జయవర్దనె గుడ్ బై..! కారణం ఇదే.. నీతా అంబానీ ఆసక్తికర పోస్టు..

IPL 2027 : ఐపీఎల్ - 2027 ఆరంభానికి ముందు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ మహేళ జయవర్ధనె ఐపీఎల్ ప్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కు గుడ్ బై చెప్పారు.

Mumbai Indians

IPL 2027 : ఐపీఎల్ – 2027 ఆరంభానికి ముందు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ మహేళ జయవర్ధనె ఐపీఎల్ ప్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కు గుడ్ బై చెప్పారు. ఆయన ముంబై ఇండియన్స్ జట్టుకు హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తుండగా.. ఆ పదవి నుంచి ప్రస్తుతం తప్పుకున్నాడు. అయితే, ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ శనివారం అధికారికంగా ప్రకటించింది.

Also Read : Hong Kong Sixes 2026 : భారత జట్టు కెప్టెన్సీలో కీలక మార్పు.. కృనాల్ పాండ్యాకు జట్టు పగ్గాలు..

మహేళ జయవర్ధనేకు ముంబై ఇండియన్స్‌ భావోద్వేగ వీడ్కోలు పలికింది. మహేళ జయవర్ధనే ముంబై ఇండియన్స్‌ జట్టుకు కేవలం ప్రధాన కోచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించిన అనుబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తి. ఆయన ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ముంబై ఇండియన్స్‌ మూడు ఐపీఎల్‌ టైటిళ్లను గెలుచుకుంది అంటూ ఉద్వేగపూరిత వ్యాఖ్యలతో జయవర్దనెకు వీడ్కోలు పలికింది.


ముంబై ఇండియన్స్ ప్రాంచేజీ యాజమాని నీతా ముఖేష్ అంబానీ సోషల్ మీడియా వేదికగా జయవర్ధనెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ‘ముబై ఇండియన్స్‌కు మహేళ జయవర్ధనే ఎన్నో ఏళ్లుగా విశేషమైన సేవలు అందించారు. ఆయన ప్రశాంతమైన నాయకత్వం, నిజాయితీ, క్రికెట్‌పై ఉన్న అపారమైన ప్రేమ మా అందరికీ ఎంతో విలువైనవి. మొత్తం ముంబై ఇండియన్స్ కుటుంబం తరఫున, ఇన్నేళ్లుగా జట్టుకు అందించిన అమూల్యమైన సేవలకు, అంకితభావానికి మహేళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయనతో కలిసి సాగించిన ప్రయాణాన్ని, మనం కలిసికట్టుగా సృష్టించుకున్న మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మహేళ ఎల్లప్పుడూ మా జట్టు ఫ్యామిలీలో భాగంగానే ఉంటారు. ఆయన భవిష్యత్తు ప్రయాణం సంతోషంతో, విజయాలతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.’ అంటూ నీతా అంబాని పేర్కొన్నారు.


అందరికీ ధన్యవాదాలు..
మహేళ జయవర్ధెనే మాట్లాడుతూ.. ‘గత పదేళ్లుగా ముంబై ఇండియన్స్‌ నాలో ఒక ప్రత్యేక భాగంగా ఉంది. నా ప్రయాణంలో ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది.. ప్రతీ ఒక్కరు ఎంతగానో సహకరించారు. ఈ అనుభవం నాకొక నిధి లాంటిది. ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాము. కఠిన సవాళ్లు కలిసి ఎదుర్కొన్నాం. ఈ ప్రయాణం నాకు గర్వకారణం. నీతా అంబానీ, ఆకాశ్‌ అంబానీ నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. నాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ముంబై మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ జయవర్దనె పేర్కొన్నాడు.

ఐపీఎల్ టోర్నీలో గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టు పేవల ప్రదర్శనతో ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తుంది. 2024, 2026 సీజన్లలో ఆ జట్టు విఫమైలంది. 2024లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవగా.. 2025లో ప్లేఆఫ్స్ కు చేరుకొని కాస్త పర్వాలేదనిపించింది. అయితే, 2026లో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్డిక్ పాండ్యాతో పాటు హెడ్ కోచ్ జయవర్ధనెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐపీఎల్ 2027 ఆరంభానికి ముందు కొత్త కోచ్ కోసం ముంబై యాజమాన్యం చేస్తుంది. ఈ క్రమంలో యాజమాన్యం జయవర్దనెకు వీడ్కోలు పలకడం గమనార్హం.