Manoj Tiwary : మ‌మ‌తా బెన‌ర్జీ పై భార‌త మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. 20 సెక‌న్లు.. 5 కోట్లు ..

భారత మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడల శాఖ మాజీ సహాయ మంత్రి మనోజ్ తివారీ (Manoj Tiwary) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు

Manoj Tiwary sensational Allegations on Mamata Banerjee

Manoj Tiwary : భారత మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడల శాఖ మాజీ సహాయ మంత్రి మనోజ్ తివారీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న ప‌ట్ల మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హ‌రించిన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.ఇక నుంచి ఆ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నాడు. తాను 5 కోట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతోనే హౌరాలోని శిల్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న‌కు టికెట్ నిరాక‌రించార‌ని ఆరోప‌ణ‌లు చేశాడు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

బెంగాల్ క్రీడల శాఖ మాజీ సహాయ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను అందులో వివ‌రించారు. త‌న‌కి ఎలా ఆటంకాలు ఎదురు అయ్యాయో చెప్పుకొచ్చారు. ‘టీఎంసీ నాయకుడు, మాజీ మంత్రి అరూప్ బిస్వాస్ నన్ను పని చేయకుండా అడ్డుకున్నారు. నేను క్రీడా ప్రపంచం నుంచి వచ్చాను, క్రీడలకు ఎంతో సేవ చేయాలనుకున్నాను. అయితే..క్రీడల శాఖ‌లో టీ, బిస్కెట్లు తిన‌డానికే ప‌రిమితం చేశారు.’ అని తివారీ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Rohit Sharma : హార్దిక్‌, సూర్య‌ల‌కు షాక్‌.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముంబై కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌?

ఫుట్‌బాల్‌, ఇత‌ర క్రీడ‌ల‌లోని యువ క్రీడాకారుల కోసం మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌న్న త‌న ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించిన‌ట్లు చెప్పుకొచ్చాడు. ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ యోహాన్ బ్లేక్ తో క‌లిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మించాల‌నుకున్నాన‌ని, ఇందుకోసం 5 కోట్లు ఖ‌ర్చువుతుంద‌న్న సాకుతో దాన్ని ప‌క్క‌న ప‌ట్టేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాస్తవానికి రూ. 700 కోట్ల క్రీడా బడ్జెట్‌ను వృధా చేశార‌ని మండిప‌డ్డారు.

కోల్‌క‌తాలో 2025లో జ‌రిగిన లియోనెల్ మెస్సీ ఈవెంట్ అట్ట‌ర్ ప్లాఫ్ కావ‌డానికి, మెస్సీ మ‌ధ్య‌లోనే వెళ్లిపోవ‌డానికి అరూప్ బిస్వాస్ ప్ర‌వ‌ర్త‌నే కార‌ణం అని చెప్పుకొచ్చాడు. భ‌ద్ర‌తా వైఫ‌ల్యం, నిర్వాకుల అస్త‌వ్య‌స్త తీరు వ‌ల్ల మెస్సీ కేవ‌లం 5 నుంచి 10 నిమిషాల్లోనే స్టేడియం వ‌దిలి వెళ్లిపోయార‌ని, ఇది రాష్ట్రంలోని క్రీడాభినులంద‌రికి అవ‌మాన‌క‌రం అని తెలిపారు. ఇక త‌న‌ను ఈ కార్య‌క్ర‌మానికి కూడా ఆహ్వానించ‌లేద‌న్నారు. త‌న ఇమేజ్ అంటే భ‌యం వ‌ల్లే త‌న‌ను దూరం పెట్టార‌న్నాడు.

Pat Cummins : పంజాబ్ పై విజ‌యం.. ట్రావిస్ హెడ్ నిద్ర‌.. పాట్ క‌మిన్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

నియోజ‌వ‌ర్గ స‌మ‌స్య‌ల గురించి వివ‌రించాల‌ని ఓ రోజు క్యాబినేట్ స‌మావేశం త‌రువాత మ‌మ‌తా బెన‌ర్జీని క‌లువ‌గా.. తాను చెప్పేందుకు వివ‌రించేందుకు త‌న‌కు 20 సెక‌న్ల స‌మ‌యాన్ని కూడా ఇవ్వ‌లేద‌న్నారు. నాకు వేరే ఏం ప‌ని లేదా? అని ముఖం పైనే ఆమె త‌న‌తో అన్న‌ద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల కోసం కాకుండా సొంత ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేస్తున్నార‌ని, ఈ ప్ర‌భుత్వం ఎక్కువ కాలం కొన‌సాగ‌ద‌ని ఆరోజే తాను గ్ర‌హించాన‌ని అన్నాడు.