Team India : భారత్‌కు మరో భారీ షాక్.. 1605 రోజుల పాటు..
1605 రోజుల పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగిన భారత జట్టు కిందకు పడిపోయింది.
India Lose Number 1 Spot In T20I Rankings After 1605 Days
- ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి
- టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోల్పోయిన భారత్
- టాప్‌లోకి దూసుకువచ్చిన ఇంగ్లాండ్
Team India : వరుసగా 6 టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోయి అత్యంత చెత్త రికార్డును మూట గట్టుకుంది భారత జట్టు. తాజాగా టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. గత కొన్నాళ్లుగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఉన్న టీమ్ఇండియా తాజాగా కిందకు పడిపోయింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్ల చేతుల్లో టీ20 సిరీస్‌లను కోల్పోవడంతో భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కిందకు పడిపోయింది.
ఇంగ్లాండ్‌తో శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించినా కూడా భారత జట్టు నంబర్ వన్ ర్యాంక్‌ను కాపాడుకునేది. ఓడిపోవడంతో ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకువెళ్లింది.
1605 రోజుల పాటు..
2022 ఫిబ్రవరిలో భారత జట్టు టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకుంది. అప్పటి నుంచి జరిగిన ద్వైపాక్షిక సిరీసుల్లో ఎంతో మెరుగ్గా రాణించింది. రెండు టీ20 ప్రపంచకప్‌లు (2024,2026)లను కైవసం చేసుకుంది. ఆసియాకప్ 2025ను సొంతం చేసుకుంది. దాదాపు 1605 రోజుల పాటు భారత జట్టు అగ్రస్థానంలోనే కొనసాగింది.
A change at the top 🔝
A new team sits at the summit of the ICC Men’s T20I Team Rankings as India slip after their series defeat to England 👀https://t.co/DopvTgVFpB
— ICC (@ICC) July 11, 2026
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోవడంతో భారత జట్టు రేటింగ్ పడిపోవడం ప్రారంభమైంది. ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లను ఇంగ్లాండ్ గెలవడంతో భారత జట్టు రేటింగ్ 268కి పడిపోయింది. అదే సమయంలో ఇంగ్లాండ్ రేటింగ్ 268కి చేరింది. ఇరు జట్ల రేటింగ్ సమానంగానే ఉన్నప్పటికి సిరీస్ ఇంగ్లాండ్ గెలవడంతో భారత అగ్రస్థానం చేజారింది.
