IND vs NZ : భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ (IND vs NZ) కోసం మ్యాచ్ అధికారులు, అంపైర్ల జాబితాను ప్రకటించింది.
- Thota Vamshi Kumar
- Published On : March 7, 2026 / 11:30 AM IST
MATCH OFFICIALS FOR T20 WORLD CUP 2026 FINAL ANNOUNCED
- ఆదివారం భారత్ వర్సెస్ కివీస్ ఫైనల్ మ్యాచ్
- అంపైర్లు, అధికారుల జాబితాను ప్రకటించిన ఐసీసీ
IND vs NZ : టీ20 ప్రపంచకప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. కాగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ కోసం మ్యాచ్ అధికారులు, అంపైర్ల జాబితాను ప్రకటించింది.
ఈ కీలక మ్యాచ్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ వ్యవహరిస్తారు. వీరిలో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
T20 World Cup : ఎంత మంది భారత క్రికెటర్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనున్నారో తెలుసా?
అంతేకాదండోయ్.. ఇల్లింగ్‌వర్త్ కు పురుషుల వన్డే ప్రపంచకప్ 2023, పురుషుల ఐసీసీ ఛాంపియన్స్2025 ఫైనల్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. మరో అంపైర్ వార్ఫ్ మహిళల ప్రపంచకప్ 2022, పురుషుల వన్డే ప్రపంచకప్ 2023లలో బాధ్యతలను నిర్వర్తించాడు.
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అల్లాహుద్దీన్ పాలేకర్ థర్డ్ అంపైర్‌గా, దక్షిణాఫ్రికాకు చెందిన ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ ఫోర్త్ అంపైర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న పాలేకర్ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లకు అధికారిక బాధ్యతలు నిర్వర్తించారు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..
* ఆన్-ఫీల్డ్ అంపైర్లు – రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్
* థర్డ్ అంపైర్ – అల్లావుద్దీన్ పాలేకర్
* ఫోర్త్ అంపైర్ – అడ్రియన్ హోల్డ్‌స్టాక్
* మ్యాచ్ రిఫరీ – ఆండీ పైక్రాఫ్ట్
