FIFA World Cup Final : లియోనెల్ మెస్సీ మ్యాజిక్.. చివరి నిమిషాల్లో ఇంగ్లండ్‌కు షాక్.. వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి అర్జెంటీనా!
FIFA World Cup Final : ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. చివరి వరకు ఉత్కంఠభరితగా సాగిన సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో అర్జెంటీనా జట్టు విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
- Harish Thanniru
- Published on- July 16, 2026 / 07:38 AM IST
Messi Magic Argentina Beat England 2-1 Reach FIFA World Cup 2026 Final
- లియోనెల్ మెస్సీ మ్యాజిక్..
- ఫిఫా ఫుట్‌బాల్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌కు షాక్..
- ఫైనల్‌లోకి దూసుకెళ్లిన అర్జెంటీనా జట్టు
FIFA World Cup Final : ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. బుధవారం అట్లాంటాలో జరిగిన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో అర్జెంటీనా జట్టు విజయదుందుబి మోగించింది. చివరి నిమిషాల్లో ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మ్యాజిక్‌తో రెండు గోల్స్ సాధించి అర్జెంటీనా జట్టు మ్యాచ్‌ను అద్భుతరీతిలో తమవైపు తిప్పుకుంది.
Also Read : Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. వన్డే దిగ్గజాలు సచిన్, ద్రావిడ్ సరసన చోటు..
మ్యాచ్‌లో మొదట ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యం సాధించింది. 55వ నిమిషంలో ఆంథోనీ గోర్డాన్ గోల్ చేసి జట్టును ముందంజలో నిలిపాడు. దీంతో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుతుందనే ఆశలు అభిమానుల్లో పెరిగాయి. కానీ, చివరి క్షణాల్లో అర్జెంటీనా అద్భుతం చేసింది. జట్టు అసలైన పోరాట పటిమను ప్రదర్శించింది. ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇచ్చిన అద్భుతమైన అసిస్టులతో ఎంజో ఫెర్నాండెజ్ సమంచేసే గోల్ నమోదు చేశాడు. అదనపు సమయంలో మరోసారి మెస్సీ అందించిన పాస్‌ను లాతరో మార్టినెజ్ గోల్‌గా మలిచి అర్జెంటీనాకు 2-1 తేడాతో విజయాన్ని అందించాడు.
అంతకుముందు ఆడిన రెండు నాకౌట్ మ్యాచ్‌లలో విజయం కోసం చెమటోడ్చిన అర్జెంటీనా.. క్వార్టర్స్‌లో స్పెయిన్, ఫ్రాన్స్‌పై గెలిచిన విషయం తెలిసిందే. అయితే, తాజా విజయంతో అర్జెంటీనా జట్టు వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక టైటిల్ కోసం జులై 19న స్పెయిన్ తో అర్జెంటీనా జట్టు తలపడనుంది. మరోవైపు ఇంగ్లాండ్ మూడో స్థానం కోసం ఫ్రాన్స్ తో పోటీ పడనుంది.
అర్జెంటీనా ఇంతకుముందు 1978, 1986, 2022లో ప్రపంచకప్ గెలిచింది. 1930, 1990, 2014లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి కూడా ప్రపంచ కప్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మెస్సి (ఎనిమిది గోల్స్) ఈసారి గోల్డెన్ బూట్ రేసులో ముందున్నాడు.
