Tilak Varma : తెలుగు కుర్రాడి మంచి మ‌న‌సు.. ముంబై త‌రుపున ఆడుతూ.. పంజాబ్ కింగ్స్‌కు మ‌ద్దతుగా వ‌చ్చిన అమ్మాయిల‌కు..

ముంబై ఇండియ‌న్స్ విజ‌యాల్లో త‌న వంతు పాత్ర పోషిస్తున్నాడు తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌.

Tilak Varma – Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్ విజ‌యాల్లో త‌న వంతు పాత్ర పోషిస్తున్నాడు తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ 18 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స‌ర్లు బాది 34 ప‌రుగుతో అజేయంగా నిలిచి ముంబై భారీ స్కోరు సాధించ‌డంలో త‌న వంతు సాయం చేశాడు. ఇక మ్యాచ్ అనంత‌రం తిల‌క్ చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు మ‌ద్ద‌తుగా వ‌చ్చిన ఇద్ద‌రు చిన్నారుల‌కు ఊహించ‌ని బ‌హుమ‌తులు ఇచ్చి వారి ముఖాల్లో ఆనందం నింపాడు.

మ్యాచ్ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌కు వెలుతున్నాడు తిల‌క్ వ‌ర్మ‌. అంద‌రూ వెళ్లిపోయినా కూడా తెల్ల‌టి దుస్తులు ధ‌రించిన ముగ్గురు అమ్మాయిలు స్టేడియంలో ఉండ‌టాన్ని గ‌మ‌నించాడు. వెంట‌నే త‌న బ్యాటింగ్ గ్లోవ్స్‌ను పై నుంచే వారి వైపుకు విసిరాడు. ఇద్ద‌రు అమ్మాయిలు వాటిని క్యాచ్ ప‌ట్టుకున్నారు. తిల‌క్ కు థ్యాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ముంబై ఇండియ‌న్స్ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Virat Kohli : ‘మీ భార్య..’ విరాట్ కోహ్లి మాటలు విని కంగుతిన్న దినేష్ కార్తీక్

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ (53 బంతుల్లో 78), తిల‌క్ వ‌ర్మ (18 బంతుల్లో 34 నాటౌట్ ) రాణించారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ 19.1 ఓవ‌ర్ల‌లో 183 ప‌రుగుల‌కే ఆలౌటైంది. పంజాబ్ బ్యాట‌ర్లో అశుతోష్ శ‌ర్మ (28 బంతుల్లో 61), శ‌శాంక్ సింగ్ (25 బంతుల్లో 41) పోరాడిన‌ప్ప‌టికీ తొమ్మిది ప‌రుగుల తేడాతో ఓట‌మి త‌ప్ప‌లేదు.

ఇక తిల‌క్ వ‌ర్మ ఈ సీజ‌న్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 208 ప‌రుగులు చేశాడు. ముంబై ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచులు ఆడ‌గా మూడు విజ‌యాలు సాధించింది. 6 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఏడో స్థానానికి చేరుకుంది.

IPL tickets : బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్‌..

ట్రెండింగ్ వార్తలు