Michael Vaughan makes bombastic statement regarding Rohit Sharma MI exit
Rohit Sharma-Michael Vaughan : ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమ్ఇండియా సారథి, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఖచ్చితంగా ముంబైని వీడుతాడనే అంచనా వేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ బాధ్యతలను నిర్వర్తిస్తాడని అన్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఐదు సార్లు జట్టుకు ట్రోఫీని అందించిన రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా దక్కించుకున్న ముంబై అతడిని కెప్టెన్ చేసింది. దీంతో వివాదం చెలరేగింది. దీన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో ప్రాంఛైజీ తీసుకున్న నిర్ణయం పై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడని, ఈ సీజన్ అనంతరం జట్టును వీడనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
Jake Fraser McGurk : కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఎవరు?
ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు, కామెంటేటర్ మైఖేల్ వాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘రోహిత్ శర్మ చెన్నైకి వెళ్లనున్నాడా? ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడా? ప్రస్తుతం చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ ఉన్నాడు. రోహిత్ వస్తే అతడు కెప్టెన్సీ వదులుకోవాల్సిందే. నా వరకు అయితే రోహిత్‌ను చెన్నై జట్టులో చూడాలని అనుకుంటున్నాను.’ అని వాన్ అన్నాడు.
ముంబై ఇండియన్స్ ఎదుర్కొన్న నాయకత్వ పరిస్థితిపై వాన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగాలని అతడు సూచించాడు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు ముంబై ఐదు మ్యాచులు ఆడగా రెండింటిలో గెలిచింది. నాలుగు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అదే సమయంలో ఐదు మ్యాచులు ఆడిన చెన్నై మూడింటిలో గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Rishabh Pant : రిషబ్ పంత్ అరుదైన ఘనత.. గిల్, కోహ్లిల తరువాత ఒకే ఒక్కడు..