×
Ad

Mitchell Marsh : మిషెల్ బ్రో నీకున్నంత బుద్ధి పాక్ కి లేదు.. పాక్ రిపోర్టర్ ప్రశ్నలకు చెంపపెట్టులాంటి ఆన్సర్లు ఇచ్చావులే..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫిబ్ర‌వ‌రి15న భార‌త్‌తో జ‌రిగే మ్యాచ్‌ను పాక్ బ‌హిష్క‌రించ‌బోతుందని దీనిపై మీ స్పంద‌న ఏంటి అంటూ మిచెల్ మార్ష్‌కు (Mitchell Marsh) ఓ ప్ర‌శ్న ఎదురైంది.

Mitchell Marsh Shuts Down Pakistan Reporter Over T20 World Cup 2026 India Boycott Question

Mitchell Marsh : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 15న భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌ను బ‌హిష్క‌రించాల్సిందిగా త‌మ జ‌ట్టును పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఆదేశించింది. దీంతో భార‌త్‌, పాక్ మ్యాచ్ పై అనిశ్చితి నెల‌కొంది. కాగా.. ఈ విష‌యంపై ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు ప్ర‌శ్న ఎదురైంది. దీనిపై అత‌డు స్పందించిన విధానం చాలా బాగుంది.

ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా జ‌ట్టు పాక్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం చివ‌రి టీ20 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో త‌మ జ‌ట్టు ఓట‌మి పై మిచెల్ మార్ష్ మాట్లాడాడు. ఈ క్ర‌మంలో ఓ రిపోర్ట‌ర్ మిచెల్ మార్ష్‌ ఇబ్బంది ప‌డే విధంగా ఓ రెండు ప్ర‌శ్న‌లు అడిగాడు. మొద‌టిది భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ ది కాగా రెండో బంగ్లాదేశ్ బాయ్‌కాట్ అంశంపై.

Salman Ali Agha : భార‌త్‌తో ఆడొద్ద‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యం పై పాక్ టీ20 కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా కామెంట్స్..

రిపోర్టర్ : ఫిబ్రవరి 15న జరగ‌నున్న భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ గురించి ఇప్పుడే తెలిసింది. ఈ మ్యాచ్‌ను బ‌హిష్క‌రించాల‌ని పాక్ ప్ర‌భుత్వం ఆదేశించింది? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

మిచెల్ మార్ష్ : ఈ సమయంలో దాని గురించి ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేను. మీకు తెలుసుకు గ‌దా.. మేం ప్ర‌పంచ‌క‌ప్ ఆడేందుకు వెలుతున్నాను. దానిపైనే మా ఫోక‌స్ అంతా ఉంది. మిగిలిన విష‌యాల‌ను ప‌ట్టించుకోము.

రిపోర్టర్ : భద్రతా కారణాల దృష్ట్యా ఐసీసీ పూర్తి స‌భ్య‌దేశ‌మైన‌ బంగ్లాదేశ్ ఈ ప్రపంచ కప్‌లో పాల్గొనడం లేదు ? ఓ ఆటగాడిగా.. ఓ ఐసీసీ పూర్తి స‌భ్య‌దేశం ఈ ప్రపంచ కప్‌లో పాల్గొన‌క‌పోవ‌డం పై మీ స్పంద‌న ఏంటి?

మిచెల్ మార్ష్ : నా మునుపటి సమాధానానికి కూడా ఇదే వర్తిస్తుంది. మనం ప్రపంచ కప్ గెలవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆస్ట్రేలియన్ జట్టుగా మేము దానిపై మాత్రమే దృష్టి పెట్టాము. మా బోర్డుపై మాకు విశ్వాసం ఉంది. వారు మేము సుర‌క్షితంగా ఉండేందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. నేను మీకు చెప్పేది అంతే.

T20 World Cup 2026 : భార‌త్‌తో మ్యాచ్ ఆడొద్ద‌న‌న్న పాక్ ప్ర‌భుత్వం.. బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. శ్రీలంక‌కు టీమ్ఇండియా..!

మొత్తంగా త‌మ దృష్టి అంతా ప్ర‌పంచ‌క‌ప్ పైనే ఉందని, మిగిలిన విష‌యాల‌ను తాము పెద్ద‌గా ప‌ట్టించుకోము అని మిచెల్ మార్ష్ స్ప‌ష్టం చేశాడు. భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లను కార‌ణంగా చూపుతా భార‌తదేశంలో మ్యాచ్‌ల‌ను ఆడేందుకు బంగ్లాదేశ్ ఇష్ట‌ప‌డని సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌లో ఆస్ట్రేలియాకు ఏదీ క‌లిసి రాలేదు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3తో ఆసీస్ కోల్పోయింది. చాలా మంది సీనియ‌ర్, విధ్వంస‌క‌ర ఆట‌గాళ్లు ఈ ప‌ర్య‌ట‌న‌కు రాలేదు. వారంతా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్రారంభానికి ముందు ఆసీస్ జ‌ట్టుతో చేర‌నున్నారు.