Mohak Kumar: విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన మోహక్.. 125బంతుల్లో 30 సిక్సులు, 331 స్కోరు
ఢిల్లీ క్యాపిటల్స్ బాల్ భవన్ క్రికెట్ అకాడమీ క్రికెటర్ మోహక్ కుమార్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. శిక్షా భారతి పబ్లిక్ స్కూల్ స్టేడియంలో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు...
- Subhan Ali Shaik
- Published On : November 27, 2021 / 07:54 AM IST
Under 13
Mohak Kumar: ఢిల్లీ క్యాపిటల్స్ బాల్ భవన్ క్రికెట్ అకాడమీ క్రికెటర్ మోహక్ కుమార్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. శిక్షా భారతి పబ్లిక్ స్కూల్ స్టేడియంలో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. డ్రీమ్ ఛేజర్స్ కప్ అండర్-13 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా 125బంతుల్లో 331పరుగులు చేశాడు. అందులో 30 సిక్సర్లు, 28ఫోర్లు ఉండటం విశేషం.
కొడితే బౌండరీ.. లేదంటే సిక్స్ అన్నట్లుగా చెలరేగి బౌలర్లపై విరుచుకుపడ్డాడు అండర్-14 ప్లేయర్.. మోహక్ కుమార్. ఓపెనర్లు 5 పరుగులు మాత్రమే నమోదు చేసి అవుట్ అయిన తర్వాత నెంబర్ 4లో బ్యాటింగ్ దిగాడు మోహక్ కుమార్. 137 నిమిషాల పాటు క్రీజులో పాతుకుపోయిన ప్లేయర్ సిక్సర్లతోనే 180 పరుగులు చేయగా.. మరో 112 పరుగులను ఫోర్లతో రాబట్టాడు.
2016 సంవత్సరంలో మహారాష్ట్ర క్రికెటర్ ప్రణవ్ ధనవాడె స్కూల్ క్రికెట్‌లో బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మ్యాచ్‌లో 1,009 పరుగులు చేసి.. ప్రపంచంలో ఒక మ్యాచ్‌లో వెయ్యి పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
………………………………..: కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తయారీకి మేం రెడీ – మోడర్నా
