Covid Booster Shot: కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తయారీకి మేం రెడీ – మోడర్నా

యూఎస్ ఫార్మాసూటికల్ కంపెనీ మోడర్నా కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తయారీకి తాము సిద్ధమని చెబుతుంది. న్యూ ఒమిక్రన్ వేరియంట్ ను ఎదుర్కొని పోరాడేందుకు గానూ బూస్టర్ డోస్ డెవలప్...

Covid Booster Shot: కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తయారీకి మేం రెడీ – మోడర్నా

Covid Booster Shot

Updated On : November 27, 2021 / 7:07 AM IST

Covid Booster Shot: యూఎస్ ఫార్మాసూటికల్ కంపెనీ మోడర్నా కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తయారీకి తాము సిద్ధమని చెబుతుంది. న్యూ ఒమిక్రన్ వేరియంట్ ను ఎదుర్కొని పోరాడేందుకు గానూ బూస్టర్ డోస్ డెవలప్ చేస్తామని శుక్రవారం వెల్లడించింది. రాబోయే కొత్త ప్రమాదాన్ని తట్టుకునేందుకు ప్రస్తుతమున్న వ్యాక్సిన్ కంటే ఎక్కువ డోస్ గల వ్యాక్సిన్ పై పనిచేస్తున్నట్లు తెలిపింది.

చాలా రోజులుగా ఈ ఒమిక్రన్ వేరియంట్ గురించి అంతా సతమతమవుతున్నారు. దీని నుంచి ఎంత త్వరగా బయటపడాలా అనే దానిపై ఆలోచిస్తున్నాం. అని ఈ వేరియంట్ గురించి మోడర్నా సీఈఓ స్టీఫెన్ బన్సెల్ మాట్లాడారు.

మరోవైపు అత్యవసరమనుకుంటే 100రోజుల్లోగా కొత్త వ్యాక్సిన్ సిద్ధం చేస్తామని చెబుతుంది ఫైజర్ వ్యాక్సిన్. ‘నిపుణుల ఉద్దేశ్యం అర్థమైంది. అందుకే B.1.1.529పై పరిశోధనలు జరుపుతున్నాం. మరో రెండు వారాల్లో మరిన్ని ల్యాబొరేటరీ టెస్టులు సిద్ధం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో వ్యాక్సిన్ డెవలప్మెంట్ తప్పనిసరి’ అని నిపుణులు చెబుతున్నారు.

………………………………. : చిత్తూరు జిల్లాలో మరోసారి భూప్రకంపనలు