Vaibhav Sooryavanshi : సంజూ శాంస‌న్ ప్లేస్‌లో కాదు.. ఆ స్టార్ ఆట‌గాడి స్థానంలో వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు ?

టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరో ఆరు నెలల్లోనే భార‌త‌ టీ20 తుది జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చెబుతున్నాడు.

Mohammad Kaif predicted Vaibhav Sooryavanshi into Indias T20I playing XI within the next 6 months

Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభవ్ సూర్యవంశీ మరో ఆరు నెలల్లోనే భార‌త‌ టీ20 తుది జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చెబుతున్నాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ లేదా ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో వైభవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో మాట్లాడుతూ తెలిపాడు.

ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు జపాన్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌కు కూడా తుది జ‌ట్టులో వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు ద‌క్క‌లేదు. అయితే అతని ప్రతిభను దృష్టిలో ఉంచుకుంటే భవిష్యత్తులో అతడిని జట్టు యాజమాన్యం విస్మరించడం కష్టమవుతుందని కైఫ్ అభిప్రాయపడ్డారు.

Mirabai Chanu : 28 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. ఆసియా గేమ్స్‌లో మీరాబాయి చానుకు ర‌జ‌తం..

తిలక్ వర్మ వైస్ కెప్టెన్ అయినప్పటికి కూడా జట్టులో అతడి స్థానం శాశ్వతం కాదని కైఫ్ తెలిపాడు. వైస్ కెప్టెన్లను కూడా గ‌తంలో జ‌ట్టు నుంచి తొల‌గించార‌న్నాడు. మరోవైపు శివమ్ దూబే ప్ర‌తి మ్యాచ్‌లో కూడా ప‌రుగులు చేయ‌డం లేద‌ని, ఇంకా అత‌డు త‌న‌ను తాను నిరూపించుకోవాల్సి ఉందన్నాడు. ఫీల్డింగ్‌లోనూ అతడికి బలహీనతలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే పూర్తి స్థాయి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా కాకుండా ప్రధానంగా బ్యాటర్‌గానే ఆడుతున్నాడని తెలిపాడు.

2026లో తిలక్ వర్మ ఓ మోస్త‌రు ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 23 మ్యాచ్‌ల్లో 34.50 సగటుతో 483 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. శివమ్ దూబే ఈ ఏడాది 170.17 స్ట్రైక్‌రేట్‌తో 502 పరుగులు చేయడంతో పాటు 24.93 సగటుతో 15 వికెట్లు తీశాడు.

ఆసియా క్రీడల్లోనూ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించవచ్చని కైఫ్ అభిప్రాయపడ్డారు. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను పరిశీలించిన తర్వాత భారత జట్టు అదనపు బౌలింగ్ ఆప్షన్లను తగ్గించి బ్యాటింగ్ బలాన్ని పెంచుకోవచ్చని ఆయన అన్నారు.

యశ్ ఠాకూర్ స్థానంలో వైభవ్‌కు అవకాశం ఇవ్వవచ్చని కైఫ్ సూచించారు. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్‌లతో పాటు అర్ష్‌దీప్ సింగ్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా రూపంలో భారత్‌కు తగినంత బౌలింగ్ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. వైభవ్ సూర్యవంశీ ఆల్‌రౌండ్ సామర్థ్యం కూడా అతడికి జట్టులో చోటు దక్కేందుకు అనుకూలంగా మారవచ్చని కైఫ్ పేర్కొన్నారు.