MS Dhoni and Donald Trump: ఇండియాలో జో బైడెన్.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోని.. వీడియో వైరల్

సంఘ్వీ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోను పోస్టు చేశాడు. ఇందులో ధోనీ, ట్రంప్ ఇద్దరూ కలిసి గోల్ప్ ఆడుతున్నట్లు చూడొచ్చు.

MS Dhoni

MS Dhoni: భారత్‍లో ఈనెల 9, 10 తేదీల్లో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇండియాకు చేరుకున్నారు. ఇదే సమయంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ కూల్ ఎం.ఎస్.ధోనీ అమెరికాలో పర్యటించారు. యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించిన ధోనీ.. మరుసటి రోజు అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో కనిపించాడు. ట్రంప్‌తో కలిసి బెడ్‌మిన్‌స్టర్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో  ధోనీ గోల్ఫ్ ఆడాడు. గోల్ఫ్ ఆడేందుకు ట్రంప్ అతిథ్యం ఇచ్చారు. దీంతో ఎం.ఎస్.ధోనీ, డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MS Dhoni : యూఎస్ ఓపెన్‌లో ఎంఎస్ ధోనీ సంద‌డి.. వీడియో వైర‌ల్‌

సంఘ్వీ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోను పోస్టు చేశాడు. ఇందులో ధోనీ, ట్రంప్ ఇద్దరూ కలిసి గోల్ప్ ఆడుతున్నట్లు చూడొచ్చు. ధోనీ బ్లూ టీషర్ట్ వేసుకొని ఉండగా, ట్రంప్ వైట్ టీషర్ట్ ధరించి గోల్ఫ్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన ధోనీ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రీ పోస్టులు చేస్తున్నారు. ధోనీ ఎక్కడున్నా కింగే అంటూ కొందరు నెటిజన్లు పేర్కొనగా.. తలైవా నువ్వు సూపర్ అంటూ మరికొందరు నెటిజన్లు రాశారు.

MS Dhoni: అయ్యయ్యో జస్ట్ మిస్.. హోండా బైక్‌పై ధోనీ.. సెల్ఫీకి ప్రయత్నించిన అభిమాని.. వీడియో వైరల్

వీడియో పోస్టు చేసిన సంఘ్వీ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త. ఎం.ఎస్. ధోనీ స్నేహితుడు. గతంలోనూ ధోనీతో కలిసిఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పలుసార్లు పంచుకున్నాడు. యూఎస్ ఓపెన్ లో సంఘ్వీ ధోనీతో కలిసి కనిపించాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు