MS Dhoni : వయసు అయిపోయింది.. నడవలేకపోతున్నా.. ధోని కామెంట్స్ వైరల్..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని (MS Dhoni ) ఇటీవల 45వ పుట్టిన రోజును జరుపుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 9, 2026 / 03:18 PM IST
MS Dhoni Gesture During India vs England 3rd T20I viral
- భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్‌ను వీక్షించిన ధోని
- తనకు వయసు అయిపోయిందని ఫ్యాన్స్‌తో సరదాగా సంజ్ఞ
- వీడియో వైరల్
MS Dhoni : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని ఇటీవల 45వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆరేళ్లు కావొస్తున్నప్పటికి కూడా ఆయనకు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
కాగా.. ఇటీవల భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ధోని హాజరు అయ్యాడు. ఆ సమయంలో ఆయన చేసిన సరదా సంజ్ఞలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు ఇప్పుడు వయసు అయిపోయిందని చెప్పుకొచ్చాడు. తన గడ్డం కూడా తెల్లబడిందని, నడవడం కూడా కష్టంగా మారిందన్నాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన ధోనీ.. అనంతరం భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆయన తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెప్టెన్‌గా భారత్‌కు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు.
ధోనీ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 538 మ్యాచ్‌లు ఆడి 17,266 పరుగులు సాధించారు. వికెట్ కీపర్‌గా 829 డిస్మిసల్స్ నమోదు చేసి అరుదైన రికార్డు నెలకొల్పారు. వన్డేల్లో 350 మ్యాచ్‌ల్లో 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 98 టీ20 మ్యాచ్‌ల్లో 1,617 పరుగులు, 90 టెస్టుల్లో మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు సాధించి మూడు ఫార్మాట్లలోనూ తన ముద్ర వేశారు.
