MS Dhoni : మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోని.. వీడియో వైరల్
రాంచిలో ట్రెయినింగ్ సెషన్ పూర్తి చేసుకున్న ధోనీ తన నివాసానికి బయలుదేరాడు. ఈ క్రమంలో యువ క్రికెటర్ కోరిక మేరకు అతడిని..
- Harishth Thanniru
- Published On : September 15, 2023 / 12:23 PM IST
MS Dhoni
MS Dhoni Bike Riding Viral Video: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. రాంచీలో బైక్ పై యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహీ చేసిన పనిని తెగ మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. 42ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే అన్నిరకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతను రాంచీలో ఉన్నాడు.
ఇటీవల నూజెర్సీలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ బెడ్‌మిన్‌స్టర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ధోనీ గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఓ యంగ్ క్రికెటర్ కు బైక్ లిఫ్ట్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోనీ బైక్ ఎక్కిన ఆ యువ క్రికెటర్ ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. బైక్ పై ఉండి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
MS Dhoni: ఆటోగ్రాఫ్ ఇచ్చి చాక్లెట్ తీసుకున్న ధోనీ.. వీడియో వైరల్
రాంచిలో ట్రెయినింగ్ సెషన్ పూర్తి చేసుకున్న ధోనీ తన నివాసానికి బయలుదేరాడు. ఈ క్రమంలో యువ క్రికెటర్ కోరిక మేరకు అతడిని తన బైక్ ఎక్కించుకున్నాడు. Yamaha RD350ని ధోని డ్రైవ్ చేస్తుండగా వెనుక కూర్చున్న యువ క్రికెటర్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ మురిసిపోయాడు. ట్రెయినింగ్ సెషన్ లో ధోనీతో ఉన్న ఫొటోను, బైక్ పై ధోనీతో వెళ్తున్న వీడియోను యువ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి.
MS Dhoni giving a lift to a young cricketer on his bike.
– A beautiful video….!!!!!pic.twitter.com/nfzKKN4Tdf
— Johns. (@CricCrazyJohns) September 15, 2023
