MS Dhoni : సీఎస్‌కేకు బిగ్ షాక్.. పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న ధోని.. రెండు వారాలు ఆటకు దూరం
ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండు వారాల పాటు ఆటకు ఎంఎస్ ధోని (MS Dhoni) దూరం కానున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- March 28, 2026 / 11:16 AM IST
MS Dhoni miss the first two weeks of TATA IPL 2026
- ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు సీఎస్‌కేకు గట్టి ఎదురుదెబ్బ
- పిక్కగాయంతో బాధపడుతున్న ఎంఎస్ ధోని
- రెండు వారాల పాటు ఆటకు దూరం
MS Dhoni : ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆటను చూడాలని అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశతప్పడం లేదు. ధోని పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అతడు రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
‘ఎంఎస్ ధోనీ ప్రస్తుతం పిక్క కండరాల గాయం నుండి కోలుకుంటున్నారు. దీని ఫలితంగా ఆయన టాటా ఐపీఎల్ 2026 మొదటి రెండు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. తలా త్వరగా కోలుకోండి.’ అని సీఎస్‌కే ఎక్స్‌లో రాసుకొచ్చింది.
SunRisers Hyderabad : సన్‌రైజర్స్ ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే ఫస్టు మ్యాచ్ ఫసక్..!
ఐపీఎల్ 2026 సీజన్ కోసం ధోని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు మొన్నటి వరకు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. దీంతో తలైవా ఆటను చూడొచ్చని అంతా భావించారు. అయితే.. ఇప్పుడు అతడు దూరం కావడం ఫ్యాన్స్‌కు నిరాశను కలిగించేది. ఇక ధోనికి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ ఆరంభం అంటే 2008 నుంచి ధోని ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లు ఆడాడు. 38.3 సగటుతో 5439 పరుగులు చేశాడు. ఇందులో 247 అర్థశతకాలు ఉన్నాయి. ఇక చెన్నైకు ధోని ఇప్పటి వరకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు.
ప్రస్తుతం ధోని దూరం కావడంతో అతడి స్థానంలో వికెట్ కీపర్ బాధ్యతలను ఉర్విల్ పటేల్ నిర్వర్తించే అవకాశం ఉంది. సంజూ శాంసన్ రూపంతో అంతర్జాతీయ క్రికెటర్ అందుబాటులో ఉన్నప్పటికి కూడా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది.
