ధోనీ కెప్టెన్‌గా ఐసీసీ టీం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం

MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్‍‌గా ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద డికేడ్ అనౌన్స్ చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని దశాబ్దపు టీ20 టీమ్‌కు కెప్టెన్‌ను చేసింది. 201 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలలో ఇండియా తరపున అసాధారణ ప్రతిభ చూపాడు మహీ.

ఇంకా ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా చోటు దక్కింది. ప్రత్యేకంగా సాధించిన ఫీట్లు ఏమీ లేకపోయినా.. ఈ దశాబ్దంలో వన్డే ఫార్మాట్ లో చేసిన పర్‌ఫార్మెన్స్‌ను బట్టి ఎంపిక చేసింది.

జట్టులోని మిగతా 11మంది ప్లేయర్ల గురించి తీసుకుంటే డేవిడ్ వార్నర్‌కు రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ స్థానం దక్కింది. కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహచరుడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ లైనప్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కు ఐదో స్థానం రాగా.. మహీ వికెట్ కీపర్ గా ఆరో స్థానంలో ఉన్నాడు.

2019 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ హీరో బెన్ స్టోక్స్ కు ఆల్ రౌండర్ గా స్థానం దక్కింది. ఇక బౌలర్ల విషయానికొస్తే.. లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ కౌంటర్ పార్ట్‌లో ట్రెంట్ బౌల్ట్ లకు స్థానం దక్కింది. దక్షిణాప్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ లతో స్పిన్ డిపార్ట్ మెంట్ పూర్తవగా పేసర్ గా శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ జట్టులో ఆఖరి స్థానం దక్కించుకున్నాడు.