MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్‌కు ధోనీ సూపర్ రియాక్షన్
సెంట్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్ కు ధోనీ ఎలా స్పందించాడో ఆ ఫ్రాంచైజీ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అభిమాని లెటర్ కు చూసి వదిలేయలేదు ధోనీ.. బాగా రాశావంటూ తన అభినందనలు తెలియజేశాడు.
- Subhan Ali Shaik
- Published On : May 17, 2022 / 08:32 PM IST
Ms Dhoni
MS Dhoni: అభిమానులను రిసీవ్ చేసుకోవడంలో ధోనీ ముందుంటాడు. అదెలా అయినా సరే, మైదానంలోకి పరుగెత్తికొచ్చినా, మనస్సు పెట్టి లెటర్ రాసినా మెచ్చుకోకుండా ఉండడు. రీసెంట్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్ కు ధోనీ ఎలా స్పందించాడో ఆ ఫ్రాంచైజీ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అభిమాని లెటర్ కు చూసి వదిలేయలేదు ధోనీ.. బాగా రాశావంటూ తన అభినందనలు తెలియజేశాడు.
నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సూపర్ కింగ్స్‌కు ధోనీ వెన్నుదన్నుగా నిలిచాడు. 2022 సీజన్‌లో, వికెట్ కీపర్-బ్యాటర్ 15వ ఎడిషన్ సందర్భంగా కెప్టెన్‌గా వైదొలగడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.
Read Also: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం – ఎంఎస్ ధోనీ
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టోర్నీ మధ్యలో జడేజా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో.. ధోనీ మరోసారి ఆ బాధ్యతలు అందుకున్నాడు. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కామెంట్లతో ముంచెత్తారు అభిమానులు.
కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కొన్ని రోజులకే జడేజా పక్కటెముక గాయం కారణంగా 2022 సీజన్‌కు దూరమయ్యాడు. మే 20న బ్రబౌర్న్ స్టేడియంలో సూపర్ కింగ్స్ తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడుతుంది.
Words from the ? framed for life &
signed with 7⃣ove!#SuperFans #WhistlePodu #Yellove ? pic.twitter.com/cpYgyTxBOI— Chennai Super Kings (@ChennaiIPL) May 17, 2022
