MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం - ఎంఎస్ ధోనీ | "Tough To Replace Him": MS Dhoni On Ravindra Jadeja

MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం – ఎంఎస్ ధోనీ

డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు చేరుకునేందుకు అవకాశాల కోసం వెదుకుతుండగా రవీంద్ర జడేజా జట్టు నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా ఏకంగా టోర్నీ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది.

MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం – ఎంఎస్ ధోనీ

 

 

MS Dhoni: డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు చేరుకునేందుకు అవకాశాల కోసం వెదుకుతుండగా రవీంద్ర జడేజా జట్టు నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా ఏకంగా టోర్నీ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. ఆల్ రౌండర్ జడేజా జట్టుకు ప్రధాన బలమని అతని లోటును తీర్చలేమని, స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ వెల్లడించాడు.

ముంబై ఇండియన్స్ తో గురువారం జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా టాస్ కోసం వచ్చిన ధోనీ జడేజాను చాలా మిస్ అవుతున్నామని చెప్పుకొచ్చాడు.

“జడ్డూ మాకు చలా సందర్భాల్లో హెల్ప్ చేశాడు. ఏ కాంబినేషన్ లో ప్రయత్నించినా సెట్ అయ్యేవాడు. ఆ స్థానాన్ని వేరొకరితో భర్తీ చేయడం కష్టం. ఫీల్డింగ్ బెటర్ గా చేయడం అందరికీ సాధ్యం కాదు. ఆ విషయంలో జడేజాను రీప్లేస్ చేయడం కష్టం” అని ధోనీ వివరించాడు.

Read Also: సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇక ఇంటికే..

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

IPL 2022లో CSK కోసం ఆల్ రౌండర్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా రూ. 16 కోట్లకు రిటైన్ అయ్యాడు. టోర్నమెంట్ ప్రారంభానికి 2 రోజుల ముందే అతణ్ని జట్టుకు కెప్టెన్‌గా నిర్ణయం తీసుకుంది సీఎస్కే. జడేజా కెప్టెన్సీలో CSK ఎనిమిది మ్యాచ్ లలో ఆరు గేమ్‌లను ఓడిపోయింది. జడేజా తన ఫామ్‌ను కోల్పోయి 111 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

×