MS Dhoni : యూఎస్ ఓపెన్‌లో ఎంఎస్ ధోనీ సందడి.. వీడియో వైరల్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) యూఎస్ ఓపెన్ (US Open) లో సందడి చేశాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) ఆడిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు.
- Thota Vamshi Kumar
- Published on- September 7, 2023 / 06:57 PM IST
MS Dhoni Watching Carlos Alcaraz match
MS Dhoni Watching Carlos Alcaraz match : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) యూఎస్ ఓపెన్ (US Open) లో సందడి చేశాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) ఆడిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యూఎస్ ఓపెన్‌లో గురువారం పురుషుల క్వార్టర్ ఫైనల్ మ్యాచులు జరిగాయి. స్పెయిన్‌కు చెందిన టాప్ సీడ్ అల్కరాజ్ 12వ సీడ్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌లు తలపడ్డారు. 6-3, 6-2, 6-4 తేడాతో అల్కరాజ్ విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. దాదాపు 2 గంటల 30 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది. మ్యాచ్ మొదటి నుంచి అల్కరాజ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వరుసగా మూడు సెట్లలలో విజయం సాధించాడు.
Asia Cup 2023 : మ్యాచ్ మధ్యలో ఆగిన ఫ్లడ్ లైట్లు.. టోర్నీ మొత్తం చీకట్లోనే ఆడించేవాళ్లా..?
కాగా.. మ్యాచ్ మధ్యలో అల్కరాజ్ కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అతడు డ్రింక్స్ తాగుతుండగా అతడి వెనుక వైపు ప్రేక్షకుల గ్యాలరీలో ధోనీ తన స్నేహితులతో మాట్లాడుతూ కనిపించాడు. ధోనీ ఓ సాధారణ ప్రేక్షకుడిగా మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయతక్వం వహిస్తున్న ధోనీ ఐపీఎల్ 2023 సీజన్లో తన జట్టును విజేతగా నిలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఐదో టైటిల్. ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే మహేంద్రుడు తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కోలుకున్న ధోనీ ప్రస్తుతం కుటుంబం, స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు.
