PSL 2024 : మ‌రీ అంత ఎందుకురా అయ్యా.. వికెట్లు నిన్ను ఏమ‌న్నాయ్ చెప్పు.. ఫ‌లితం అనుభ‌వించావుగా

క్రికెట్‌ను జెంటిల్ మేన్ గేమ్ అని అంటారు. అయితే.. కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు ఆట‌గాళ్లు త‌మ స‌హ‌నం కోల్పోతుంటారు.

Naseem Shah fined 10% of his match fees for kicking the stumps in PSL 2024

PSL 2024 – Naseem Shah : క్రికెట్‌ను జెంటిల్ మేన్ గేమ్ అని అంటారు. అయితే.. కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు ఆట‌గాళ్లు త‌మ స‌హ‌నం కోల్పోతుంటారు. ఈ క్ర‌మంలో వారు మైదానంలో చేసే చర్య‌లు జెంటిల్‌మేన్ గేమ్‌కు మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోతుంటాయి. తాజాగా పాకిస్తాన్ ఆట‌గాడు న‌సీం షా మ్యాచ్ జ‌రుగుతుండ‌గా గ్రౌండ్‌లోని వికెట్ల‌ను కాలితో త‌న్నాను. దీంతో అంపైర్ మ్యాచ్ రిఫ‌రీకి ఫిర్యాదు చేశాడు. మ్యాచ్ రిఫ‌రీ త‌గిన చ‌ర్య‌లు తీసుకున్నాడు.

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2024లో న‌సీం షా ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఆదివారం ఇస్లామాబాద్ యునైటెడ్‌, ముల్తాన్ సుల్తాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 228 ప‌రుగులు చేసింది. ముల్తాన్ బ్యాట‌ర్ల‌లో ఉస్మాన్ ఖ‌వాజా (100; 50 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగాడు. అనంత‌రం కొలిన్ మ‌న్రో (84; 40 బంతుల్లో 9 ఫోర్లు, 5సిక్స‌ర్లు), షాదాబ్ షాన్ (54; 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించ‌డంతో ఇస్లామాబాద్ ల‌క్ష్యాన్ని స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

న‌సీం షా ఓవ‌రాక్ష‌న్‌..!

ఈ మ్యాచ్‌లో ముల్తాన్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా న‌సీం షా స‌హ‌నం కోల్పోయాడు. ముల్తాన్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ను న‌సీం షా వేశాడు. ఈ ఓవ‌ర్‌ను అద్భుతంగా వేసిన అత‌డు కేవ‌లం 9 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. అయితే.. ఏమైందో తెలీదు గానీ ఓవ‌ర్ పూర్తి అయిన త‌రువాత వికెట్లు కాలితో త‌న్నాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్ మ్యాచ్ రిఫ‌రీకి ఫిర్యాదు చేశాడు. న‌సీం పీఎస్ఎల్ కోడ్‌ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన‌ట్లు మ్యాచ్ రిఫ‌రీ రోషన్ మహానామా తేల్చాడు. దీంతో న‌సీం మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానా విధించాడు.

ఈ ఘ‌ట‌న వైర‌ల్‌గా మారింది. ఏంటో మరీ.. వీళ్లు ఇంతేనా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

IPL 2024 : ఆర్‌సీబీ అభిమానుల‌కు షాక్‌.. బెంగ‌ళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధం ? కేఎస్‌సీఏ ప్ర‌త్యేక స‌మావేశం

ట్రెండింగ్ వార్తలు