IPL 2024 : ఆర్‌సీబీ అభిమానుల‌కు షాక్‌.. బెంగ‌ళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధం ? కేఎస్‌సీఏ ప్ర‌త్యేక స‌మావేశం

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్) 17వ సీజ‌న్‌ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది.

IPL 2024 : ఆర్‌సీబీ అభిమానుల‌కు షాక్‌.. బెంగ‌ళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధం ? కేఎస్‌సీఏ ప్ర‌త్యేక స‌మావేశం

KSCA calls for special meeting to discuss water scarcity in Bengaluru ahead of IPL 2024

IPL 2024-Chinnaswamy stadium : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్) 17వ సీజ‌న్‌ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. ఐపీఎల్ 2024 ఆరంభానికి మ‌రో 11 రోజుల స‌మ‌య‌మే మిగిలి ఉంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీసీసీఐ 21 మ్యాచ్‌ల‌కు సంబంధించిన‌ షెడ్యూల్‌ను మాత్ర‌మే విడుద‌ల చేసింది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న అనంత‌రం మిగిలిన మ్యాచ్‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే బీసీసీఐ వెల్ల‌డించింది. అయితే.. ఇప్ప‌డు ఓ చిక్కు వ‌చ్చి ప‌డింది.

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెంగ‌ళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధం ఏర్ప‌డింది. ఎందుకంటే ప్ర‌స్తుతం బెంగ‌ళూరు సిటీ నీటి స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఇది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే ఐపీఎల్‌ 2024 మ్యాచ్‌లపై ప్రభావం చూపుతుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆర్‌సీబీ(రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు )కి చిన్న‌స్వామి స్టేడియం హోం గ్రౌండ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో బెంగ‌ళూరు త‌న మొద‌టి మ్యాచ్‌ను మార్చి 25న పంజాబ్ కింగ్స్‌తో ఆడ‌నుంది.

ఆసక్తికరంగా క్రికెటర్ల పొలిటికల్ ఎంట్రీ.. చర్చనీయాంశంగా యూసుఫ్ పఠాన్ నియోజకవర్గం

నీటి ఎద్ద‌డి నేప‌థ్యంలో కేఎస్‌సీఏ స‌మావేశం..

ఐపీఎల్ మ్యాచుల‌ను వినియోగించే పిచ్‌ను సిద్ధం చేసేందుకు ఎక్కువ మొత్తంలో నీటి అవ‌స‌రం ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో నీటి ల‌భ్య‌త పై క‌ర్ణాట‌క రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) దృష్టి సారించింది. రెండు వారాల్లో మూడు మ్యాచుల‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న నేప‌థ్యంలో నీటి ఎద్ద‌డిపై చ‌ర్చించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం సమావేశానికి పిలుపునిచ్చింది. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో కేఎస్‌సీఏ స‌భ్యుడు మాట్లాడాడు. కేఎస్‌సీఏ సమావేశంలో ఓ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు చెప్పాడు. ఆ స‌మావేశం అనంత‌రం బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యం పై ఎటువంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేమ‌న్నాడు.

బెంగళూరు నీటి సంక్షోభం

వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక రాజధాని నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. గత కొన్ని వారాలుగా నగరవ్యాప్తంగా నీటి ట్యాంకర్లకు డిమాండ్ చాలా అధికంగా ఉంది. అందుకున్న నివేదికల ప్రకారం.. నీటి ట్యాంకర్ ఛార్జీ గతంలో రూ.700-800 ఉండగా ఇప్పుడు రూ.1500-1800కి పెరిగింది. రాబోయే ఐదు నెలలకు డిమాండ్‌కు సరిపడా సరఫరా ఉంటుందని బీడ‌బ్ల్యూఎస్ఎస్‌బీ(BWSSB) హామీ ఇచ్చినప్పటికీ నగర ప్రజలను భయాందోళనలు పట్టుకున్నాయి.

Shoaib Bashir : ఏమ‌య్యా బ‌షీర్‌.. క్లీన్‌బౌల్డ్‌కు రివ్య్వూనా? చూడు అంద‌రూ ఎలా న‌వ్వుతున్నారో.. వీడియో

ఐపీఎల్ 2024 కోసం ఆర్‌సీబీ జట్టు :
విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్, మహ్మద్ సిరాజ్, దినేష్ కార్తీక్, యష్ దయాల్, అనూజ్ రావత్, విల్ జాక్స్, లాకీ ఫెర్గూసన్, రీస్ టాప్లీ, మయాంక్ డాగర్, టామ్ కర్రాన్, మహిపాల్ లోమ్రోర్, రాజన్ కుమార్, కర్ణ్‌ శర్మ, సుయాష్ ప్రభుదేసాయి, మనోజ్ భాండాగే, ఆకాష్ దీప్, సౌరవ్ చౌహాన్, హిమాన్షు శర్మ, స్వప్నిల్ సింగ్, వైషాక్ విజయ్‌కుమార్, రజత్ పాటిదార్.

బెంగ‌ళూరులో మ్యాచ్‌లు ఇవే..
మార్చి 24 – ఆర్‌సీబీ వ‌ర్సెస్ పంజాబ్ కింగ్స్‌
మార్చి 29 – ఆర్‌సీబీ వ‌ర్సెస్ కేకేఆర్‌
ఏప్రిల్ 2 – ఆర్‌సీబీ వ‌ర్సెస్ ల‌క్నో