Sanju Samson : ఆ మూడు ఇన్నింగ్స్‌ల‌తో ఇంకెన్నాళ్లు సంజూ శాంస‌న్‌.. ఇక చాలు..

Sanju Samson : ఓ మ్యాచ్‌లో అద‌ర‌గొట్ట‌డం ఆ త‌రువాత వ‌రుస‌గా విఫ‌లం కావ‌డం క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన‌ప్పటి నుంచి ఇదే తంతు.

Netizens demand Sanju Samson be dropped, asking how long he can get by on those three innings

Sanju Samson : ఓ మ్యాచ్‌లో అద‌ర‌గొట్ట‌డం ఆ త‌రువాత వ‌రుస‌గా విఫ‌లం కావ‌డం క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన‌ప్పటి నుంచి ఇదే తంతు. జ‌ట్టు నుంచి తీసేస్తారు అనే స‌రికి మ‌రో అద్భుత ఇన్నింగ్స్ ఆడ‌డం ఆ త‌రువాత మ‌ళ్లీ వ‌రుస‌గా విప‌లం కావ‌డం.. ఇది ఎవ‌రి గురించో అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. టీమ్ఇండియా ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ గురించే.

ఈ యువ ఆట‌గాడిగాలో అద్భుత టాలెంట్ ఉంద‌ని, సెల‌క్ట‌ర్లు జ‌ట్టులో చోటు ఇవ్వ‌కుండా తొక్కేస్తున్నారంటూ మొన్న‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో ఈ ఆట‌గాడి గురించి పెద్ద చ‌ర్చే న‌డిచింది. ఇక రాక రాక అవ‌కాశం వ‌స్తే అందులో విఫ‌లం కావ‌డంతో జ‌ట్టుకు దూరం అయిన సంద‌ర్భాలు సంజూ కెరీర్‌లో ఎన్నో.

ఇక సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024ను గెలిచిన త‌రువాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డంతో సంజూ ద‌శ తిరిగింది. పొట్టి ఫార్మాట్‌లో భార‌త జ‌ట్టులో రెగ్యుల‌ర్ ఆట‌గాడిగా చోటు ద‌క్కించుకుంటున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే మూడు శ‌త‌కాలు బాది సూప‌ర్ అనిపించుకున్నాడు. క‌ట్ చేస్తే సీన్ మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. నిల‌క‌డ లేమీతో ఇబ్బంది ప‌డ్డాడు. అయిన‌ప్ప‌టికి కూడా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్, అప్ప‌టి కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌ద్ద‌తుతో జ‌ట్టులో కొన‌సాగుతూ వ‌చ్చాడు.

Abhishek Sharma : మ్యాచ్ ర‌ద్దైనా.. చ‌రిత్ర సృష్టించిన అభిషేక్ శ‌ర్మ‌.. సిక్స‌ర్ల కింగ్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఆరంభంలో పేల‌వ ఫామ్‌తో ఇబ్బంది ప‌డ్డాడు. ఒక ద‌శ‌లో జ‌ట్టుకు ఇత‌డు భారం అని త‌ప్పించాల‌నే డిమాండ్లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికి టీమ్‌మేనేజ్‌మెంట్ మ‌ద్ద‌తుతో తుది జ‌ట్టులో స్థానం సంపాదించుకుంటూ వ‌చ్చాడు. అయితే.. ఆక‌స్మాత్తుగా సూప‌ర్ ఫామ్ అందుకున్నాడు.

త‌ప్ప‌క గెల‌వాల్సిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ పై 50 బంతుల్లో 97 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో భార‌త్‌కు అద్భుత విజ‌యాన్ని అందించాడు. ఆ త‌రువాత సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై 42 బంతుల్లోనే 89 ప‌రుగులు చేశాడు. ఇక ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ పై 46 బంతుల్లోనే 89 ప‌రుగులు చేసి భార‌త్ క‌ప్పు గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. సంజూ కెరీర్‌లోనే ఇంత నిల‌క‌డ‌గా వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచ‌రీలు చేయ‌డం ఇదే తొలిసారి.

దీంతో అత‌డు మారిపోయాడ‌ని, సీనియ‌ర్ ఆట‌గాడి స్థాయిలో ఉండ‌డంతో బాధ్య‌త‌గా ఆడున్నార‌ని అంతా భావించారు. క‌ట్ చేస్తే మ‌ళ్లీ సీన్ మొద‌టికే వ‌చ్చింది. ఐర్లాండ్‌తో జ‌రిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫ‌లం అయ్యాడు. తొలి టీ20 మ్యాచ్‌లో కేవ‌లం 5 ప‌రుగులే చేసిన సంజూ శాంస‌న్‌ రెండో టీ20 మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. పోని ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనైనా ఆడ‌తాడు అనుకుంటే వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దైన తొలి టీ20 మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి తీవ్ర ఇబ్బందులు ప‌డ్డ సంజూ 7 బంతులు ఎదుర్కొని సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో టామ్ బాంటన్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

వైభ‌వ్‌ను ఆడించాల్సిందే..

సంజూ ఇలా వ‌రుస‌గా విఫ‌లం అవుతుండ‌డంతో అత‌డిని త‌ప్పించాల‌నే డిమాండ్లు ఎక్కువ అయ్యాడు. మ‌రోవైపు అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్న 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీని సంజూ ప్లేస్‌లో ఆడించాల‌ని మాజీ క్రికెట‌ర్ల‌ల‌తో పాటు ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే.. జ‌ట్టు మేనేజ్‌మెంట్ మాత్రం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సంజూ ఆడిన ఆ మూడు ఇన్నింగ్స్‌ల కార‌ణంగానే అత‌డికి ఇంకా జ‌ట్టులో చోటు ఇస్తుంద‌ని ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

అది గ‌తం అని, ఇప్ప‌టికైనా సంజూను త‌ప్పించి నిల‌క‌డ‌గానే ఆడే ఆట‌గాడికి చోటు ఇస్తే బాగుంటుంద‌ని అంటున్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2028, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని జ‌ట్టును ఇప్ప‌టి నుంచే త‌యారు చేసుకోవాల‌ని, ఇలా నిల‌క‌డ లేని ఆట‌గాడిని న‌మ్మితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు.