Riyan Parag : హార్దిక్ పాండ్యాతో నటి అనన్య పాండే డ్యాన్స్.. కన్నీళ్లు పెట్టుకున్న రియాన్ పరాగ్..? మీమ్స్ వైరల్
బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి హార్దిక్ పాండ్యా డ్యాన్స్ చేశాడు.
గత మూడు రోజులుగా ముంబైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహా వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వీరి పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు హాజరు అయ్యారు. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అనంత్ అంబానీ, రాధికా వివాహ వేడుకకు హాజరయ్యాడు.
ఈ వేడకలో బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి హార్దిక్ పాండ్యా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో హార్దిక్ కు అనన్య పాండే డ్యాన్స్ స్టెప్పులు నేర్పుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు.
IND vs PAK : భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్.. రాత్రి 9 గంటలకే.. ఎక్కడ చూడొచ్చడంటే..?
Riyan😭😭 pic.twitter.com/VSOtQ2SUBg
— Secular Chad (@SachabhartiyaRW) July 12, 2024
రియాన్ పరాగ్, అనన్య పాండే వివాదం..
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన తరువాత రియాన్ పరాగ్ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. కాగా.. ఈ యువ ఆటగాడు లైవ్ స్ట్రీమింగ్ చేసే గేమింగ్ ఛానెల్‌ని కూడా నడుపుతున్నాడు. ఈ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో.. పరాగ్ యూట్యూబ్‌లో కాపీరైట్ లేని సంగీతం కోసం వెతుకుతున్నాడు. సెర్చ్ బాక్స్ పై అతడు క్లిక్ చేయగానే అతని సెర్చ్ హిస్టరీలో బాలీవుడ్ హీరోయిన్లు అనన్య పాండే, సారా అలీఖాన్ పేర్లు కనిపించాయి. వారి పేర్ల పక్కనే హాట్ అని రాసి ఉంటుంది. అతడు తన సెర్చ్ హిస్టరీని హైడ్ చేయకపోవడంతో అతడి పర్సనల్ హిస్టరీ కాస్త పబ్లిక్కు లీక్ అయ్యింది.
దీనిపై అప్పట్లోనే పరాగ్ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం పాండ్యాతో అనన్య డాన్స్ చేయడంతో మరోసారి ట్రోలింగ్‌కు గురి అయ్యాడు.
Riyan Parag be like 😭😭 pic.twitter.com/GMBVHtm8lJ
— sohom 🇦🇷 (@AwaaraHoon) July 12, 2024
Riyan Parag to Hardik – Gaddari Korbe😞💔
— Neon Man (@NeonMan_01) July 12, 2024