IND vs PAK : భార‌త్‌, పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. రాత్రి 9 గంట‌ల‌కే.. ఎక్క‌డ చూడొచ్చ‌డంటే..?

దిగ్గ‌జ క్రికెట‌ర్ల మ‌ధ్య జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది.

IND vs PAK : భార‌త్‌, పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. రాత్రి 9 గంట‌ల‌కే.. ఎక్క‌డ చూడొచ్చ‌డంటే..?

India Champions vs Pakistan Champions When and where to watch final

Updated On : July 13, 2024 / 12:18 PM IST

India Champions vs Pakistan Champions : దిగ్గ‌జ క్రికెట‌ర్ల మ‌ధ్య జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు (శ‌నివారం జూన్ 13న‌) బ‌ర్మింగ్‌హామ్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. చిరకాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌డంతో స‌గ‌టు క్రికెట్ అభిమాని దృష్టి ఈ మ్యాచ్ పై ప‌డింది.

దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ సార‌థ్యంలో ఇండియా ఛాంపియ‌న్స్ జ‌ట్టు సెమీ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైన‌ల్‌కు చేరుకుంది. మ‌రోవైపు పాకిస్తాన్ ఛాంపియ‌న్స్ జ‌ట్టు సెమీఫైన‌ల్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది. కాగా.. ఈ టోర్నీ లీగ్ ద‌శ‌లో పాకిస్తాన్ పై భార‌త్ ఓడిపోయింది. ఈ క్ర‌మంలో నేటి ఫైన‌ల్ మ్యాచ్‌లో గెలిచి టీమ్ఇండియా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భార‌త అభిమానులు కోరుకుంటున్నారు.

Shubman Gill Sister : పాపం గిల్‌..! స్నేహితుడు అని న‌మ్మితే.. టీమ్ఇండియా స్టార్ క్రికెట్‌తో గిల్ సోద‌రి ప్రేమ‌..?

టీమ్ఇండియా ఆట‌గాళ్లు కీల‌క స‌మ‌యంలో ఫామ్‌లోకి రావ‌డం క‌లిసి వ‌చ్చే అంశం. సెమీస్‌ మ్యాచ్‌లో ఉత‌ప్ప‌, కెప్టెన్ యువ‌రాజ్ సింగ్ లు మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్ద‌రితో పాటు ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్.. యూస‌ఫ్ ప‌ఠాన్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్‌లు భీక‌ర ఫామ్‌లో ఉండ‌డం భార‌త్‌కు క‌లిసి వ‌చ్చే అంశం. వీరితో పాటు సురైశ్‌, అంబ‌టి రాయుడు ఫైన‌ల్ మ్యాచ్‌లో చెల‌రేగితే పాక్ ను ఓడించ‌డం పెద్ద క‌ష్టంకాదు.

ఇక ఈ మ్యాచ్ స్థానిక కాల‌మానం ప్ర‌కారం సాయంత్ర 4.30 గంట‌ల ప్రారంభం కానుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 9 గంట‌ల‌కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌ను టీవీల్లో స్టార్‌స్పోర్ట్స్‌లో చూడొచ్చు. ఫోన్‌లో  వీక్షించాల‌ని అనుకుంటే మాత్రం ఫ్యాన్ కోడ్.. యాప్ లేదా వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Gautam Gambhir : మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఆడతామంటే కుద‌ర‌దు..? హార్దిక్‌కు గంభీర్ వార్నింగ్..?