IND vs NZ : దంచికొట్టిన గ్లెన్ ఫిలిప్స్‌, టిమ్ సీఫెర్ట్.. ఐదో టీ20 మ్యాచ్‌లో భార‌త్ పై న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం

IND vs NZ : హామిల్ట‌న్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs NZ : హామిల్ట‌న్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం సాధించింది. 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కివీస్ బ్యాట‌ర్ల‌లో టిమ్ సీఫెర్ట్ (93; 50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), గ్లెన్ ఫిలిప్స్ (65 నాటౌట్; 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. డారిల్ మిచెల్ (29; 16 బంతుల్లో 4 సిక్స‌ర్లు) రాణించాడు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, నితీశ్ కుమార్ రెడ్డి త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Ishan Kishan : టీ20 క్రికెట్‌లో ఇషాన్ కిష‌న్ మ‌రో మైలురాయి.. హార్దిక్ పాండ్యా రికార్డు బ్రేక్..


అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్ (61; 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (50; 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాలు బాదారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ మిల్నే నాలుగు వికెట్లు తీయ‌గా.. నాథ‌న్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఇక ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన్ప‌టికి కూడా భార‌త్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవ‌సం చేసుకుంది.