Nikhat Zareen Crowned World Boxing Champion 2nd strait time
Women’s World Boxing: తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్.. వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీలో ఇప్పటికే రెండు బంగారు పథకాలు గెలుచుకున్న భారత్.. ఈ జాబితాలో మూడో బంగారు పథకాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన 50 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్ జరీన్ 5-0తో విజయం సాధించి వరుసగా రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. కాగా గతేడాది 52 కేజీల విభాగంలో సైతం పసిడి పట్టింది. దిగ్గజ మేరికోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ గెలుచుకున్న రెండో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించారు. ఇక 48 కేజీల విభాగంలో నీతూ గాంగాస్ 5-0 తేడాతో లుత్సాయిఖాన్ (మంగోలియా)ను చిత్తు చేసింది. మరోవైపు 81 కేజీల విభాగం టైటిల్ పోరులో స్వీటి 4-3తో వాంగ్ లీనా (చైనా)పై పోరాడి గెలిచింది.