BCCI : రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు నో ప్లేస్.. దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు, జట్ల వివరాలు ఇవే..
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాలు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కన్నా ముందు దేశవాలీ క్రికెట్ ఆడతారనే ప్రచారం జరిగింది.
- Thota Vamshi Kumar
- Published On : August 14, 2024 / 05:30 PM IST
No Rohit Sharma Virat Kohli and Jasprit Bumrah as BCCI names Duleep Trophy squads
Duleep Trophy squads : టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాలు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కన్నా ముందు దేశవాలీ క్రికెట్ ఆడతారనే ప్రచారం జరిగింది. అయితే.. ఈ ముగ్గురు ఆటగాళ్లు మినహా మిగిలిన స్టార్ ఆటగాళ్లు అందరూ దులీప్ ట్రోఫీ ఆడనున్నారు. దులీప్ ట్రోఫీ 2024 సెప్టెంబర్ 5న ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే జట్ల వివరాలను, ఏ ఆటగాళ్లు ఏ జట్టు తరుపున ఆడనున్నారు అనే వివరాలను బీసీసీఐ వెల్లడించింది.
సెప్టెంబరు 5 నుండి సెప్టెంబర్ 22 వరకు జరగనున్న తొలి రౌండ్ దులీప్ ట్రోపీలో A, B, C, D అనే నాలుగు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో పోటీపడనున్నాయి.
టీమ్ A : శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.
టీమ్ B : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , జగదీషన్ (వికెట్ కీపర్).
టీమ్ C : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, మయాంక్ మార్కండే (వికెట్ కీపర్), సందీప్ వారియర్.
టీమ్ D : శ్రేయాస్ లియర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ భరత్ గుప్తా, కెఎస్ (వికెట్‌కీపర్), సౌరభ్ కుమార్.
దులీప్ ట్రోఫీ షెడ్యూల్..
సెప్టెంబర్ 5-8 : ఇండియా A vs ఇండియా B – రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం, అనంతపురం
సెప్టెంబర్ 5-8: ఇండియా సి vs ఇండియా డి – ACA ADCA గ్రౌండ్, అనంతపురం
సెప్టెంబర్ 12-15: ఇండియా A vs ఇండియా D – రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం, అనంతపురం
సెప్టెంబర్ 12-15: ఇండియా B vs ఇండియా C – ACA ADCA గ్రౌండ్, అనంతపురం
సెప్టెంబర్ 19-22: ఇండియా A vs ఇండియా C – రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం, అనంతపురం
సెప్టెంబర్ 19-22: ఇండియా B vs ఇండియా D – ACA ADCA గ్రౌండ్, అనంతపురం
PCB : టెస్టు క్రికెట్ ఎంట్రీ టికెట్ రూ.15 మాత్రమే.. పాక్ ఆటగాళ్లకు ఆ మాత్రం కూడా ఎక్కువేనా..?
