ICC ODI Mens Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు.. కెరీర్ బెస్ట్ ర్యాంక్
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

ICC ODI Rankings 2024 Rohit Sharma Moves Up To No Two
ICC ODI Mens Rankings : పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోనూ దుమ్ములేపాడు. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలం అయినా కూడా హిట్‌మ్యాన్ మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు బాది 157 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నిలిచాడు. ఓ స్థానం మెరుగుపరచుకున్న హిట్‌మ్యాన్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
ఇక లంక సిరీస్‌లో విఫలం అయిన గిల్ ఓ స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. అదే విధంగా మూడు ఇన్నింగ్స్‌ల్లో 58 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ తన నాలుగో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన హ్యారీ టెక్టార్ ఓ స్థానం మెరుగుపర్చుకుని కోహ్లీతో సమానంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలోనే ఉన్నాడు.
వన్డేల్లో బ్యాటింగ్‌లో టాప్-5 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఆటగాళ్లు..
బాబర్ ఆజామ్ (పాకిస్తాన్) – 824 రేటింగ్ పాయింట్లు
రోహిత్ శర్మ (భారత్) – 765 రేటింగ్ పాయింట్లు
శుభ్‌మన్ గిల్ (భారత్) – 763 రేటింగ్ పాయింట్లు
విరాట్ కోహ్లీ (భారత్) – 746 రేటింగ్ పాయింట్లు
హ్యారీ టెక్టార్ (ఐర్లాండ్) – 746 రేటింగ్ పాయింట్లు
వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో నిలిచాడు. బుమ్రా ఎనిమిదో స్థానంలో, సిరాజ్ పదో స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో బౌలింగ్‌లో టాప్-5 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఆటగాళ్లు..
కేశవ్ మహరాజ్ (దక్షిణాఫ్రికా) – 716 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 688 రేటింగ్ పాయింట్లు
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) – 686 రేటింగ్ పాయింట్లు
కుల్దీప్ యాదవ్ (భారత్) – 665 రేటింగ్ పాయింట్లు
బెర్నార్డ్ (నమీబియా) – 657 రేటింగ్ పాయింట్లు