Manu Bhaker-Neeraj Chopra : నీరజ్ చోప్రాతో మనుభాకర్ పెళ్లి.. ఎట్టకేలకు స్పందించిన షూటర్ తండ్రి..
జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొట్టారు.

Manu Bhaker Marrying Neeraj Chopra Shooter Father Breaks Silence
Manu Bhaker-Neeraj Chopra : జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొట్టారు. నీరజ్ రజత పతకాన్ని సొంతం చేసుకోగా రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది మను భాకర్. ఇక వీరిద్దరు మాట్లాడుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరగా మారింది. ఇందులో వీరిద్దరు కాస్త సిగ్గుపడుతూ మాట్లాడుకుంటున్నట్లుగా కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు అనే రూమర్లు హల్ చల్ చేశాయి.
ఇక మనుభాకర్ తల్లి నీరజ్ చేత తలపై ఒట్టు వేయించుకోవడం కూడా ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే.. దీనిపై మను భాకర్ తండ్రి రామ్ కిషన్ స్పందించారు. మను ఇంకా చిన్నపిల్లే అని చెప్పారు. ఆమెకు పెళ్లి వయసు రాలేదన్నారు. అసలు ఆ విషయం గురించి ఇప్పటి వరకు ఆలోచించలేదన్నారు. మను తల్లి నీరజ్ తో మాట్లాడడం, తలపై ఒట్టు తీసుకోవడంపైనా వ్యాఖ్యానిస్తూ.. ఆమె అతడిని ఓ బిడ్డలా భావిస్తోందన్నారు. అయితే.. నిజానికి వాళ్ల మధ్య జరిగింది ఏంటన్నదానిపై స్పష్టత లేదన్నారు.
PCB : టెస్టు క్రికెట్ ఎంట్రీ టికెట్ రూ.15 మాత్రమే.. పాక్ ఆటగాళ్లకు ఆ మాత్రం కూడా ఎక్కువేనా..?
నీరజ్ బంధువు స్పందన..
పారిస్ రజత పతక విజేత వివాహానికి సంబంధించిన వస్తున్న వార్తలపై నీరజ్ మామ కూడా మాట్లాడారు. నీరజ్ మెడల్ తెచ్చినప్పడు దేశం మొత్తానికి ఎలా తెలిసిందో అలాగే అతడి పెళ్లి కూడా అందరికి తెలుస్తుందన్నారు.
జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ 89.45 మీటర్లు విసిరి రజతపతకం సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు. 10 మీటర్ల వ్యక్తిగత పిస్టల్ విభాగంతో పాటు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.