Hardik Pandya : హాట్ సింగర్ జాస్మిన్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్..? ఆమె ఇన్‌స్టా చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. గ్రీస్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియో అది.

Hardik Pandya - jasmin walia
Hardik Pandya – jasmin walia : భారత్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నెటిజన్ల నుంచి ట్రోల్స్ కు గురైన హార్దిక్ పాండ్యా.. ఆ తరువాత సెర్బియా నటి, తన సతీమణి నటాషా స్టాంకోవిచ్ తో విడాకుల వ్యవహారంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. తాజాగా మరోసారి హార్దిక్ పాండ్యా పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. నటాషాతో విడాకుల వ్యవహారం తరువాత పాండ్యా హాట్ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా, హార్దిక్ పాండ్యా డేటింగ్ లో ఉన్నారని, వారిద్దరూ కలిసి విహార యాత్రకుసైతం కలిసి వెళ్లినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
Also Read : Tharun Bhascker Mother : అమ్మతో కలిసి సింగపూర్ ట్రిప్ వేసిన డైరెక్టర్.. ఫొటోలు వైరల్..
తాజాగా హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. గ్రీస్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియో అది. నాలుగు రోజుల ముందు జాస్మిన్ వాలియా కూడా ఇదే లోకేషన్ లో దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని చర్చ జరుగుతుంది. దీంతో హార్దిక్ పాండ్యా అభిమానులు జాస్మిన్ వాలియా ఎవరు.. ఆమె ఎక్కడ ఉంటుంది అంటూ నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారట. చివరికి జాస్మిన్ గురించి తెలుసుకొని హార్దిక్ ఈసారి తనకు సరియైన అమ్మాయినే ఎంపిక చేసుకున్నాడని పేర్కొంటున్నారు.
Also Read : Hardik Pandya : కొడుకు బర్త్ డే.. నా క్రైమ్ పార్ట్‌నంటూ హార్దిక్ ఎమోషనల్ పోస్ట్..
జాస్మిన్ వాలియాది ఇంగ్లాండ్ లోని ఎసెక్స్ ప్రాంతం. ఆమె టీవీ సిరీస్ లలో నటించింది. పలు రియాల్టీ షోల్లో పాల్గొంది. 2014లో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పలు ఆల్బమ్ లు చేసింది. ఆమె పాడిన బామ్ డిగీ పాటను ఓ బాలీవుడ్ సినిమాలో రీమేక్ చేశారు. బాలీవుడ్ లోనూ ఆమె ఓ మ్యూజిక్ వీడియో చేసింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ తో 6.4లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగిఉంది. తన ఇన్‌స్టాలో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.
View this post on Instagram
View this post on Instagram