Wrestlers Protest: సాక్షి మాలిక్, ఆమె భర్త చెప్పిన విషయాలు అసత్యాలు: మైనర్ రెజ్లర్ తండ్రి
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫిర్యాదు చేసిన ఏడుగురిలో మైనర్ రెజ్లర్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
- T Venkateshwarlu
- Published On : June 18, 2023 / 06:56 PM IST
Sakshi Malik - Satyawart Kadian
Wrestlers Protest – Delhi: రెజ్లర్ సాక్షి మాలిక్ (Sakshi Malik) తో పాటు ఆమె భర్త, రెజ్లర్ సత్యవర్త్ కడియాన్ (Satyawart Kadian)పై ఓ మైనర్ రెజ్లర్ తండ్రి మండిపడ్డారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై ఫిర్యాదు చేసిన ఏడుగురిలో మైనర్ రెజ్లర్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
అయితే, ఆమె తన స్టేట్‌మెంట్‌ను మార్చేసిందని, ఆమె కుటుంబానికి బెదిరింపులు వస్తుండడమే ఇందుకు కారణమని శనివారం సాక్షిమాలిక్, ఆమె భర్త చెప్పారు. దీనిపై ఆ మైనర్ రెజ్లర్ తండ్రి స్పందించారు. తామేం బెదిరింపులు ఎదుర్కోవడం లేదని ఓ జాతీయ మీడియాకు చెప్పారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్ ను వెనక్కి తీసుకోవడం వెనక అటువంటి ఘటనలు కారణం కాదని అన్నారు. తాము ఏం చేయాలనుకున్నామో అది చేశామని తెలిపారు. సాక్షిమాలిక్ దేని ఆధారంగా అటువంటి వ్యాఖ్యలు చేసిందో చెప్పాలని నిలదీశారు.
కాగా, శనివారం సాక్షి మాలిక్, సత్యవర్త్ స్పందిస్తూ రెజ్లర్లలో ఐక్యత లోపించిందని, అందుకే చాలా రోజులుగా తాము మౌనంగా ఉన్నామని చెప్పారు. తాము ఎప్పటికీ ఐక్యతను సాధించలేమని తెలిపారు. వారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Wrestlers Protest: అందుకే మేమంతా సైలెంట్ అయిపోయాం: రెజ్లర్ సాక్షి మాలిక్, ఆమె భర్త సత్యవర్త్
