టీ20 పరాజయం తర్వాత న్యూజిలాండ్ పట్టుదలతో కనిపిస్తుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి భారత్‌పై అస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలోనే హామిల్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కివీస్. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(32), పృథ్వీ షా(20)ఆచితూచి ఆడినప్పటికీ స్వల్ప విరామంతో పెవిలియన్ చేరుకున్నారు.
వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీతో పాటుగా శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకూ టిమ్ సౌథీ, గ్రాండ్ హోమ్ చెరో వికెట్ పడగొట్టగలిగారు. 25 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 134/2. క్రీజులో కోహ్లీ(41), అయ్యర్(29)లు ఉన్నారు.
50-run partnership comes up between @imVkohli & @ShreyasIyer15.#TeamIndia 104/2 after 19.2 overs
Live – https://t.co/ewSrnE8I9m #NZvIND pic.twitter.com/GCME0IEcyt
— BCCI (@BCCI) February 5, 2020